రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ లో భాగంగా ప్రపంచ దేశాల దిగ్గజాలు అందరూ ఒకే చోట చేరారు. ఈ టోర్నీ ద్వారా వచ్చిన డబ్బు మెుత్తాన్ని రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారికి, గాయపడిన వారికి, అలాగే రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. ఇక ఈ టోర్నీని భారత్ విజయంతోనే ప్రారంభించింది. తన మెుదటి మ్యాచ్ లోనే దక్షిణాఫ్రికా లెజెండ్స్ ను 61 పరుగుల తేడాతో ఓడించిన విషయం తెలిసింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం ఇండియా ఆటగాళ్లు అంతా విజయాన్ని ఓ హోటల్ లో సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుకల్లో క్రికెట్ దిగ్గజం సచిన్ తో పాటు, యువరాజ్, ఇర్ఫాన్ పఠాన్, రైనా మరికొంత మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. ఈ వేడుకలో రైనా, పఠాన్ సింగర్స్ అవతారం ఎత్తగా.. యువీ మాత్రం డ్యాన్సర్ గా మారాడు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
మైదానంలో ఆటగాళ్ల ప్రవర్తన వేరు.. అలాగే పార్టీల్లో వారి ప్రవర్తన వేరు. గ్రౌండ్లో ఎంత అగ్రెసీవ్ గా ఉంటారో.. పార్టీల్లో అంత సరదాగా ఉంటారు. ఈ క్రమంలోనే రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ లో భాగంగా ఇండియన్ లెజెండ్స్ అందరూ ఒకే చోటుకు రావడం జరిగింది. ఇక చాలా కాలం తర్వాత అందరు ఒకే చోట చేరితే.. ఎలా ఉంటుందో మనకీ తెలుసు. ఇక వీరందరూ తాజాగా ఓ పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీకి చెందిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఈ పార్టీలో స్టార్ క్రికెటర్స్ సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్ లు మైక్ అందుకుని హిందీ పాటలతో అలరించారు. వారు పాడుతుంటే అచ్చంగా ప్రోఫెషనల్ సింగర్స్ పాడుతున్నారా? అన్న సందేహం రాక మానదు. అంతలా వారు మధురమైన గొంతులతో అలరించారు. ఇక ఈ వీడియోని సురేష్ రైనా తన ట్వీటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.”ఇది మాన టీమ్.. మన కుటుంబం.. ప్రేమా.. సంతోషాలు కలగలసిన సమయం ఇది” అంటూ ఆ వీడియో కింద రాసుకొచ్చాడు. అయితే ఇటీవలే పఠాన్ వెండితెరకు పరిచయం అయిన సంగతి మనకు తెలిసిందే. అతడు విక్రమ్ హీరోగా నటించిన కోబ్రా మూవీలో కీలక పాత్రలో నటించాడు.
ఇక ఈ పార్టీలో సెంట్రాఫ్ అట్రాక్షన్ అంటే యువరాజ్ సింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే తనదైన మాస్.. క్లాస్ స్టెప్పులతో పార్టీని మరో మూడ్ లోకి తీసుకెళ్లాడు. అతడి డ్యాన్స్ కు ఆటగాళ్లంతా ఫిదా అయ్యారనే చెప్పాలి. ఇక యువీ డ్యాన్స్ పై పఠాన్ సరదాగా స్పందిస్తూ..”ఈ పార్టీలో మాకు అత్యంత ఖరిదైన చీర్ లీడర్ దొరికాడు. ఇదొక అందమైన రాత్రి” అంటూ రాసుకొచ్చాడు. యువీ స్పందిస్తూ..”ఈ రోజు ఇద్దరు లెజెండరీ సింగర్స్ సారథ్యంలో మా పార్టీ సరదాగా సాగింది” అని రైనా, పఠాన్ లను ఉద్దేశించి సరదాగా వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఈ రెండు వీడియోలు నెట్టింట వైరల్ గా మారియి. చాలా కాలం తర్వాత లెజెండ్స్ అందరు ఒకే చోట చేరడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మరి ఇండియన్ లెజెండ్స్ తమలో ఉన్న టాలెంట్ ని చూపించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
This is our team 🇮🇳, one family. Lots of love and lots of fun ❤️🏏 Don’t miss Yuvi PA’s entry 😉😜@sachin_rt @YUVSTRONG12 @IrfanPathan @pragyanojha @munafpa99881129 pic.twitter.com/iGhlhaAlk4
— Suresh Raina🇮🇳 (@ImRaina) September 13, 2022
Having fun with two legendary singers 🎤 @IrfanPathan @ImRaina 🎶 and of course the legend of legends @sachin_rt 👑 @munafpa99881129 @ManpreetGony @pragyanojha #roadsafetyworldseries #indialegends pic.twitter.com/wjP31UcYVZ
— Yuvraj Singh (@YUVSTRONG12) September 12, 2022