యువరాజ్ సింగ్ అంటే బౌండరీల మోతే కాదు అమ్మాయిలతో డేటింగ్ విషయంలో కూడా ఈ లెఫ్ట్ హ్యాండర్ కి ఒక ట్రాక్ రికార్డ్ ఉంది. తాజాగా ఒక బ్యూటిఫుల్ లేడీతో దిగిన ఫోటో.. తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
భారత క్రికెట్ లో బ్యాటింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తనదైన ముద్ర వేసాడు. పవర్ హిట్టింగ్ చేస్తూ పరిమిత ఓవర్ల క్రికెట్ లో పరుగుల వరద పారించేవాడు. అయితే కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే క్యాన్సర్ బారిన పడిన యువీ దాన్ని అధిగమిస్తూ టీమిండియాకు 2011 లో వరల్డ్ కప్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు 2007 టీ 20 వరల్డ్ కప్ లో కూడా యువీదే కీ రోల్ . కెరీర్ లో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన యువీ.. అనూహ్యంగా జట్టులో స్థానం కోల్పోయాడు. 2015 లో జట్టులో స్థానం దక్కకపోవడం అప్పట్లో సంచలనంగా మారింది. ఇక 2019 వరల్డ్ కప్ లో కూడా స్థానం కోసం ఎంతో ఎదురు చూసిన నిరాశే ఎదరైంది. దీంతో 2019 లోనే క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే ఇదంతా నాణానికి ఒక వైపు మాత్రమే. యువరాజ్ ప్లే బాయ్ అన్న సంగతి చాలా కొద్దిమందికే తెలుసు. తాజాగా ఒక మహిళ విషయంలో చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
యువరాజ్ సింగ్ అంటే బౌండరీల మోతే కాదు అమ్మాయిలతో డేటింగ్ విషయంలో కూడా ఈ లెఫ్ట్ హ్యాండర్ కి ఒక ట్రాక్ రికార్డ్ ఉంది. బాలీవుడ్ హీరోయిన్ హజెల్ కీచ్‌ని పెళ్లాడిన యువరాజ్ సింగ్.. పెళ్ళికి ముందు చాలా లవ్ స్టోరీలను తన ఖాతాలో వేసుకున్నాడు. కిమ్ శర్మ,బాలీ వుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొనే, రియా సేన్, ప్రీతి జింటా వంటి బాలీవుడ్ హీరోయిన్లతో ప్రేమాయణం నడిపించాడు. ఇక ఖడ్గం సినిమాలో హీరోయిన్ గ నటించిన కిమ్ శర్మను యువరాజ్ సింగ్ పెళ్లాడబోతున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇదంతా పక్కన పెడితే తాజాగా యువరాజ్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ పోస్ట్..ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ఒక బ్యూటిఫుల్ లేడీతో దిగిన ఫోటోని తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టి ‘ఈరోజు నువ్వు నాకు ఎన్ని షాట్స్ ఇవ్వబోతున్నావు’ అంటూ ఆమె అకౌంట్‌ని ట్యాగ్ చేశాడు. ఆమె ఎవరో కాదు అమెరికన్ నటి క్యాథరిన్ న్యూటన్.
క్యాథరిన్ న్యూటన్ అనేక హాలీవుడ్ సినిమాల్లో నటించింది. ‘బ్యాడ్ టీచర్’, ‘లేడీ బర్డ్’, ‘ఫ్రీకీ’, ‘ది మార్షల్ ఆర్ట్స్ కిడ్’, ‘పారానార్మల్ యాక్టివిటీ 4’, ‘యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్’ వంటి చెప్పుకోదగ్గ సినిమాలు. ఈ విషయం పక్కన పెడితే.. ఈ బ్యూటీ ఇటీవలే జరిగిన ది ఓపెన్’ గోల్ఫ్ టోర్నీ ఆరంభ వేడుకకు క్యాథరిన్ హాజరైంది. అయితే ఈ ఫంక్షన్ కోసం స్కాట్లాండ్కి వెళ్లిన యువరాజ్ సింగ్, ఆమెతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ‘ఎన్ని షాట్స్ ఇస్తావ్’ అనే వ్యాక్యాన్ని యువరాజ్ సింగ్ ఏ ఉద్దేశంతో వాడాడో తెలియక తలలు బాదుకుంటున్నారు. అయితే చూడడానికి కాస్త డబల్ మీనింగ్ డైలాగ్ లాగ ఇబ్బంది పెట్టినా ఈ విషయంపైనా ఒకొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. యువీ బూతు అర్థం వచ్చేలా షాట్స్ పదాన్ని వాడాడని కొందరు అంటుంటే,మరి కొందరు మాత్రం క్యాథరిన్ న్యూటన్ నటించిన ‘యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్’ సినిమాలో ఓ సీన్ గురించి యువీ ఇలా కామెంట్స్ చేసి ఉండవచ్చని మరికొందరు చెప్పుకొస్తున్నారు. మొత్తానికి తన పోస్ట్ తో యువరాజ్ సింగ్ సోషల్ మీడియాను కాసేపు షేక్ చేసాడు. మరి ఈ పోస్ట్ పై మీరేమనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలపండి.