క్రికెట్ లో ఎంత స్టార్ బ్యాటర్ అయినా కొంతమంది బౌలింగ్ ని ఆడడానికి ఇబ్బంది పడతాడు. ఆస్ట్రేలియన్ ఓపెనర్ వార్నర్ ది కూడా ప్రస్తుతం ఇలాంటి సమస్యే. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ బలహీనతను అధిగమించలేక మరోసారి పెవిలియన్ కి చేరాడు. ప్రస్తుతం ఈ అవుట్ పై స్టువర్ట్ బ్రాడ్ తండ్రి క్రిస్ బ్రాడ్ అందరికి టార్గెట్ అయ్యాడు.
యాషెస్ లో భాగంగా లీడ్స్ లో జరుగుతున్న మూడో టెస్టు రసవత్తరంగా జరుగుతుంది. మూడు వికెట్లకు 68 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ కాసేపటికే రూట్ బెయిర్ స్టో వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ స్టోక్స్ మరోసారి ఆపద్బాంధవుడి పాత్ర పోషించాడు. 80 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ కి భారీ ఆధిక్యం అందకుండా చేసాడు. దీంతో ఆస్ట్రేలియాకి తొలి ఇన్నింగ్స్ లో కేవలం 26 పరుగుల ఆధిక్యం మాత్రమే లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కమ్మిన్స్ సేనకి..స్టువర్ట్ బ్రాడ్ మూడో ఓవర్లో మూడో ఓవర్లోనే గట్టి షాకిచ్చాడు. ఆ జట్టు ఓపెనర్ వార్నర్ ని పెవిలియన్ కి పంపాడు. ప్రస్తుతం ఈ అవుట్ పై స్టువర్ట్ బ్రాడ్ తండ్రి క్రిస్ బ్రాడ్ అందరికి టార్గెట్ అయ్యాడు.
క్రికెట్ లో ఎంత స్టార్ బ్యాటర్ అయినా కొంతమంది బౌలింగ్ ని ఆడడానికి ఇబ్బంది పడతాడు. ఆస్ట్రేలియన్ ఓపెనర్ వార్నర్ ది కూడా ప్రస్తుతం ఇలాంటి సమస్యే. ఏంతో మంది బౌలింగ్ ని సమర్ధవంతంగా ఎదర్కొన్న ఈ స్టార్ ఓపెనర్ ఇంగ్లాండ్ పేసర్ బ్రాడ్ కి తలవంచక తప్పట్లేదు. యాషెస్ ఎప్పుడు జరిగినా వార్నర్ పదే పదే బ్రాడ్ బౌలింగ్ లో అవుట్ అవుతూనే ఉన్నాడు. ఇప్పటివరకు కేవలం టెస్టుల్లోనే 17 సార్లు బ్రాడ్.. వార్నర్ ని పెవిలియన్ కి పంపాడు. లీడ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో వార్నర్ రెండు సార్లు బ్రాడ్ బౌలింగ్ లోనే అవుట్ కావడం గమనార్హం. ఈ సందర్భంగా బ్రాడ్ తండ్రి అయినటువంటి క్రిస్ బ్రాడ్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. వార్నర్ ని అవమానకరించే రీతిలో చేసిన మీమ్స్ ఇపుడు అతన్ని వివాదంలోకి లాగాయి.
ఇందులో భాగంగా ఒక నెటిజన్ అమెరికన్ యానిమేటెడ్ సిట్ కామ్ సిరీస్ లోని సీంసన్స్ లోని బార్ట్ అనే క్యారెక్టర్ ని వార్నర్ ముఖంతో మార్ఫింగ్ చేసి పెట్టాడు. బ్రాడ్ మల్లి నన్ను అవుట్ చేసాడు అనేట్లుగా ఈ మీమ్ క్రియేట్ చేశారు. అయితే ఈ మీమ్ ని స్టువర్ట్ బ్రాడ్ తండ్రి క్రిష్ బ్రాడ్ రీ షేర్ చేసాడు. దీన్ని చూసిన నెటిజన్స్ క్రిష్ బ్రాడ్ ని ఒక ఆట ఆడుకుంటున్నారు. కొడుకు ప్రతిభ చూసి సంతోషపడడంలో తప్పు లేదు. కానీ ఒక రిఫరీ హోదాలో ఉంది మీరు ఇలా దిగజారిపోవడం కరెక్ట్ కాదు. వార్నర్ ని మరీ అంతలా తీసే యాల్సిన అవసరం లేదు. ఇదిమీ నుంచి అస్సలు ఊహించలేదు. 2007 వరల్డ్ కప్ లో భాగంగా యువరాజ్ సింగ్ వరుసగా 6 సిక్సులు కొట్టినప్పుడు ఇలాంటి మీమ్ ఎందుకు తాయారు చేయలేదు అని సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి క్రిస్ బ్రాడ్ అత్యుత్సాహం ప్రదర్శించి తగిన మూల్యమే చెల్లించుకున్నాడు. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
— Chris Broad (@ChrisBroad3) July 7, 2023