భారత్-ఆస్ట్రేలియా మధ్య రేపటి(గురువారం) నుంచి ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. నాగ్‌పూర్ వేదికగా జరిగే తొలి టెస్టు కోసం ఇరు జట్లు పూర్తి స్థాయిలో సిద్ధం అయ్యాయి. నెట్స్‌లో ముమ్మర ప్రాక్టీస్‌తో పాటు నాగ్‌పూర్ పిచ్‌ను సైతం పరిశీలించాయి. అయితే.. మ్యాచ్ ఆరంభానికి ముందు మీడియాతో మాట్లాడిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్, వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గురించి తాము పెద్దగా ఆలోచించడం లేదని, అతనంటే మాకు భయం లేదని, అశ్విన్‌ను ఎదుర్కొడానికి తమ వద్ద టెక్నిక్స్ ఉన్నాయంటూ ధీమా వ్యక్తం చేశాడు.
కానీ.. భారత్‌తో టెస్టు ఆరంభానికి పది రోజుల ముందుగానే ఇక్కడికి వచ్చిన ఆస్ట్రేలియా జట్టు. పాత పిచ్‌లపై స్పిన్‌కు అనుకూలంగా ఉండే పిచ్‌లపై అశ్విన్ లాంటి బౌలింగ్ యాక్షన్ ఉన్న భారత యువ బౌలర్ మహేష్ పితియాను నెట్ బౌలర్‌గా పెట్టుకుని మరీ ఆసీస్ బ్యాటర్లు ప్రాక్టీస్ చేశారు. ఈ విషయంపై కూడా స్పందిస్తూ.. ఇండియాలో అడుగుపెట్టిన తర్వాత తాము చాలా మంది ఆఫ్ స్పిన్నర్లను ఎదుర్కొన్నామని అందులో పితియా ఒకడని స్టీవ్ స్మిత్ పేర్కొన్నాడు. అశ్విన్ మంచి క్వాలిటీ బౌలర్ అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ.. అతన్ని మేము కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటామని అన్నాడు.
అలాగే నాగ్‌పూర్ పిచ్‌ను మంగళవారం పరిశీలించిన స్మిత్.. దాని గురించి కూడా మాట్లాడుతూ.. ఈ పిచ్‌లో బౌన్స్ పెద్దగా ఉండని, ఒక వైపు పూర్తి పోడిగా ఉండటంతో స్పిన్‌కు అనుకూలంగా ఉండొచ్చని, ముఖ్యంగా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లకు పిచ్ నుంచి మంచి సహకారం ఉంటుందని స్మిత్ తెలిపాడు. అలాగే మ్యాచ్ గడిచే కొద్ది పిచ్‌లో మూమెంట్ ఉంటుందని కూడా స్మిత్ వెల్లడించాడు. అయితే.. గతంలో మన దేశంలోనే జరిగిన టెస్టు సిరీస్‌లో స్మిత్‌ను అశ్విన్ మూడు సార్లు అవుట్ చేశాడు. అలాగే స్మిత్ సైతం అశ్విన్ బౌలింగ్‌లో 55 సగటు కలిగి ఉన్నాడు. ఈ ఇద్దరి మధ్య పోరు ఎప్పుడూ ఆసక్తి కరంగానే ఉంటుంది. మరి ఈ సిరీస్‌లో ఇద్దరిలో ఎవరు పైచేయి సాధిస్తారని మీరు భావిస్తున్నారు? అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Steven Smith said, “Ravi Ashwin is a quality bowler, but we have the tools in the kit bag to counter that”.
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 7, 2023
Steve Smith in Nagpur: Ashwin ki ball yahin pe pitch hogi ghoomegi, ya seedhi aaegi? pic.twitter.com/OLZ15bse8s
— Sushant Mehta (@SushantNMehta) February 7, 2023