శ్రీలంక టూర్ ఆఫ్ ఇండియా 2023లో వన్డే సిరీస్ ని కూడా శుభారంభం చేశారు. తొలి వన్డే మ్యాచ్ లో భారత్- శ్రీలకంపై 67 పరుగుల తేడాతో ఘన విజయం నమోదుచేసింది. ఈ మ్యాచ్ లో ఆట పరంగా బాగా చెప్పుకోదగ్గ విషయాలు కోహ్లీ శతకం, షనక పోరాటం మాత్రమే. కానీ, వాటన్నింటికి మించి కెప్టెన్ రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆతను కనబరిచిన స్పోర్ట్స్ మన్ షిప్ కి శ్రీలంక దిగ్గజాలు ఫిదా అయిపోయారు. రోహిత్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. నెట్టింట రోహిత్ శర్మనే హాట్ టాపిక్ గా మారిపోయాడు.
రోహిత్ గురించి ఆంజెలో మాథ్యూస్ ఈ విధంగా ట్వీట్ చేశాడు.. “చాలామంది కెప్టెన్లు ఇలాంటి పని చేయరు. రోహిత్ శర్మకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. షమీ చేసింది చట్టాల ప్రకారం సరైందే అయినా కూడా.. ఆ నిర్ణయాన్ని రోహిత్ శర్మ వెనక్కిి తీసుకుని గొప్ప క్రీడాస్ఫూర్తిని చాటుకున్నాడు“ అంటూ ఆంజెలో మాథ్యూస్ రోహిత్ శర్మను పొగడ్తలతో ముంచెత్తాడు. మరోవైపు శ్రీలంక దిగ్గజ ఆటగాడు సనత్ జయసూర్య కూడా రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురిపించాడు.
సనత్ జయసూర్య రోహిత్ శర్మను ఉద్దేశించి ఇలా ట్వీట్ చేశాడు. “ఇక్కడ నిజమైన విజేత రోహిత్ శర్మ చూపించిన క్రీడా స్ఫూర్తి. రోహిత్ శర్మ గొప్పతనానికి నీకు హ్యాట్సాఫ్” అంటూ సనత్ జయసూర్య ట్వీట్ చేశాడు. ప్రస్తుతం శ్రీలంక మాజీలు, క్రికెటర్లు మాత్రమే కాదు.. అక్కడి ప్రజలు కూడా రోహిత్ శర్మ చూపించిన క్రీడాస్ఫూర్తిని మెచ్చుకుంటున్నారు. నిజానికి ఐసీసీ రూల్స్ ప్రకారం మన్కడింగ్ చేయటం సరైందే అయినా కూడా రోహిత్ శర్మ మాత్రం అప్పీల్ ను వెనక్కి తీసుకుని హదయాలు గెలుచుకున్నాడు.
Not many captains would do this but hats off to @ImRo45 for withdrawing the appeal even though the law says so! Displaying great sportsmanship 👏 pic.twitter.com/Dm2U3TAoc9
— Angelo Mathews (@Angelo69Mathews) January 10, 2023
అసలు ఆ సమయంలో ఏం జరిగిందంటే.. ఛేజింగ్ లో శ్రీలంక చేతులెత్తేసింది. శ్రీలంక 37.5 ఓవర్లలోనే 206 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. భారీ స్కోర్ తేడాతో లంక పరాజయం ఖాయం అయిపోయింది. అలాంటి సమంయంలో షనక చేసిన పనికి స్కోర్ అంతరం బాగా తగ్గిపోయింది. అసలు శ్రీలంక 50 ఓవర్లు ఆడుతుందని ఎవరూ అనుకోలేదు. అలాంటిది షనక ముందుండి 50 ఓవర్లు ఆడించాడు. వందకు పైగా పరుగుల తేడాతో గెలవాల్సిన మ్యాచ్ ను షనక 67 పరుగులకు కుదించాడు. 50 ఓవర్లలో 306 పరుగులు చేసింది అంటే.. దానికి కారణం షనకానే.
The real winner was the sportsmanship of Rohit Sharma for refusing to take the run out. I doff my cap to you ! https://t.co/KhMV5n50Ob
— Sanath Jayasuriya (@Sanath07) January 10, 2023
49వ ఓవర్లో షనక 95 పరుగుల వద్ద ఉన్నాడు. తొలి బంతికి రెండు పరుగులు చేసిన షనక.. రెండో బంతికి సింగిల్ తీసుకున్నాడు. అతను కచ్చితంగా సింగిల్ తీసుకుని శతకం నమోదు చేసుకుంటాడని షమీ భావించాడు. అందుకే నాన్ స్ట్రైకింగ్ లో ఉన్న షనకను మన్కడింగ్ చేశాడు. అది గమనించిన రోహిత్ శర్మ- షమీ చేసిన పనిని ఖండించాడు. అప్పీల్ ను వెనక్కి తీసుకోవాలని సూచించాడు. అంపైర్ కు కూడా తాము అప్పీల్ వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పి షనక బ్యాటింగ్ కంటిన్యూ చేసేలా చేశాడు. ఆ మ్యాచ్ లో షనక 108 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. టీమిండియా మ్యాచ్ గెలిచింది.. రోహిత్ శర్మ హృదయాలను కూడా గెలుచుకున్నాడు.
Shami mankading sanaka… #RohitSharma #ViratKohli #INDvsSL #shami #ODI #PrithviShaw #DasunShanaka #RahulDravid #Gill pic.twitter.com/iwe8NVOd01
— ☆☆AD☆☆ (@Adarsh52250021) January 11, 2023