ఐపీఎల్ 2022 సీజన్ ఎంతో ఉత్కంఠగా సాగుతోంది. ఐపీఎల్ లో ఎక్కువ వికెట్లు సాధించిన చెన్నై, ముంబై మాత్రం వరుసగా టేబుల్ లాస్ట్ పొజిషన్ లో కొనసాగుతున్నాయి. మరోవైపు వరుస పరాజయాలతో సీజన్ ప్రారంభించిన సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం.. వరుస విజయాలతో దూసుకుపోతోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో సమిష్టిగా రాణిస్తూ వరుస విజయాలు నమోదు చేస్తున్నారు. తాజాగా జమ్ము ఎక్స్ ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్ తో పంజాబ్ ఆటగాళ్లను కట్టడి చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఆఖరి ఓవర్ మెయిడెన్ చేయడమే కాకుండా.. 20వ ఓవర్లో 4 వికెట్లు పడగొట్టాడు. మొత్తం 4 ఓవర్లలో 4 వికెట్లు పడగొట్టి.. 28 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 24 బంతుల్లో 15 డాట్ బాల్స్ ఉండటం విశేషం.
ఇదీ చదవండి: వీడియో: చిరుతలా మెరుపు వేగంతో క్యాచ్ పట్టిన కింగ్ కోహ్లీ!
అంతేకాకుండా ఉమ్రాన్ మాలిక్ ఐపీఎల్ హిస్టరీలో 20వ ఓవర్ మెయిడెన్ చేసిన నాలుగో బౌలర్ గా రికార్డుల కెక్కాడు. ఇప్పటివరకు ఈ ఫీట్ సాధించిన నాలుగో బౌలర్ గా ఉమ్రాన్ నిలిచాడు. 2008లో ఇర్ఫాన్ పటాన్, 2009లో లసిత్ మలింగా, 2017 జైదేవ్ ఉనడ్కట్, 2022లో పంజాబ్ కింగ్స్‌పై ఉమ్రాన్ మాలిక్ ఈ ఘనత సాధించాడు. మంచి లైన్ అండ్ లెంగ్త్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఈ సీజన్ మొత్తం తన బౌలింగ్ ని ఇలాగే కొనసాగించగలిగితే.. రానున్న టీ20 వరల్డ్ కప్ లో ఉమ్రాన్ మాలిక్ కు అవకాశం దక్కినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సీజన్ స్టార్టింగ్లో కాస్త గాడి తప్పినట్లు కనిపించినా కూడా ప్రస్తుతం మంచి ఫామ్లో కొనసాగుతున్నాడు. ఉమ్రాన్ మాలిక్ ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Stumps were flying, catches being taken and there was a lot of pace courtesy Umran Malik!
Not a run scored in the final over of the innings and Malik ends up with figures of 4/28 🔥🔥#PBKSvSRH #TATAIPL #Umranmalik #Cricket #JammuExpress pic.twitter.com/z242QL3K1Y
— Choudhary Furqan Mehboob (@ch__furqan) April 17, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.