సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ అనే సినిమా విడుదలకు సిద్ధమైంది. చెన్నైలో గ్రాండ్ గా నిర్వహించిన ఆడియో వేడుకలో కావ్య మారన్ గురించి మాట్లాడాడు.
ఐపీఎల్ లో సన్ రైజర్స్ పరిస్థితి ప్రతి సీజన్ కు దిగజారుతూ వస్తుంది. స్టార్టింగ్ లో అంచనాలు లేకుండా అదరగొట్టిన హైదరాబాదీ జట్టు ఇప్పుడేమో చెత్త ప్రదర్శనతో విమర్శలను మూట కట్టుకుంటుంది. ముఖ్యంగా చివరి మూడుసీజన్ లు చూసుకున్నట్లయితే ప్లే ఆఫ్ కి వెళ్లడం సంగతి పక్కన పెడితే పాయింట్ల పట్టికలో చివరి స్థానాల్లో ఉంటుంది. ఇక ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో 14 మ్యాచులకు గాను కేవలం 4 విజయాలతో చివరి స్థానంతో సరిపెట్టుకుంది. జట్టులో సీనియర్ల ప్లేయర్లను తొలగించి పూర్తిగా యువకులకు అవకాశం ఇచ్చి చేతులు కాల్చుకుంది. డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్‌ను, జానీ బెయిర్‌స్టో, రషీద్ ఖాన్‌లను వదిలేసుకొని భారీ మూల్యమే చెల్లించుకుంది. అయితే ప్లేయర్లను కొనే విషయంలో కావ్య మారన్ ప్రయోగాలకు వెళ్ళి చేతలు కాల్చుకుంది. దీంతో సన్‌రైజర్స్ ఓడిపోవడం, కావ్య ముఖం బాధతో నిండిపోవడం.. ఈ సీజన్ అంతా ఇదే రిపీటైంది. దీనిపై సూపర్ స్టార్ రజినీకాంత్ స్పందిస్తూ ఒక కీలకమైన సలహా ఇచ్చాడు.
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ అనే సినిమా విడుదలకు సిద్ధమైంది. ఆగస్టు 10న ఈ సినిమా రిలీజ్ కాబోతుండగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ వేడుకల్లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. పాన్ ఇండియాగా రాబోతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. బీస్ట్ సినిమా తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ చేస్తున్న చిత్రం ఇది. సన్ పిక్చర్స్ బ్యానర్ ఈ సినిమాని నిర్మిస్తుంది. తాజాగా ఈ సినిమా ఆడియో వేడుకలు చెన్నైలో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో రజినీకాంత్, తమన్నా, శివ రాజ్ కుమార్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిస్తే.. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ స్పెషల్ పెర్మార్మెన్స్ ఇరగదీసాడు. అయితే ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ కావ్య మారన్ గురించి ప్రస్తావించాడు.
ఇంతకీ జైలర్ ఆడియో వేడుకలో కావ్య గురించి రజిని కాంత్ ఎందుకు మాట్లాడాడు అనే సందేహం మీలో వచ్చి ఉంటుంది. ఈ సినిమా నిర్మాత ఎవరో కాదు కావ్య మారన్ తండ్రి కళానిధి మారన్. “ఐపీఎల్ లో నేను సన్ రైజర్స్ మ్యాచులను చేసేవాడిని. అయితే ఆ జట్టు మ్యాచ్ ఓడిపోయినప్పుడు కావ్య మారన్ పడే బాధను మాత్రం చూడలేకపోయాను. మ్యాచ్ ఓడిపోతున్న సందర్భంలో స్టేడియంలో కావ్య నిరాశగా ఉండటం చూసి చాలాసార్లు ఛానల్ కూడా మార్చేసే వాడిని. ఈ సారైనా ఆక్షన్ లో మంచి ప్లేయర్ లను తీసుకోవాలి. ప్రతి మ్యాచ్ గెలవాలనే కసి ఆటగాళ్లలో ఉండాలి. అని ఈ సందర్భంగా తలైవా కళానిధి మారన్ కి సలహా ఇచ్చాడు. మరి సూపర్ స్టార్ రజనీకాంత్ ఇచ్చిన సలహాతోనైనా సన్ రైజర్స్ జట్టు ఈ సారి యాక్షన్ లో మంచి ప్లేయర్లను తీసుకుంటుందేమో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.