ఏదైనా సినిమా హిట్ అయితే దానికి సీక్వెల్ వస్తే బాగుంటుందనిపిస్తుంది. జైలర్ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి కూడా సీక్వెల్ వస్తే బాగుణ్ణు అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. దీనిపై దర్శకుడు నెల్సన్ క్లారిటీ ఇచ్చారు.
కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాలు సాధిస్తాయి. అలా సంచలన విజయం సాధించిన సినిమా జైలర్. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జైలర్ మూవీ రికార్డుల ఊచకోత నడుస్తుంది. ఒక సినిమాలో హీరో చెప్పిన డైలాగ్ కి తగట్లు జైలర్ మూవీ ఎనీ సెంటర్ సింగల్ హ్యాండ్ హిట్ మూవీ గా ముందుకు దూసుకుపోతుంది. లేటెస్టుగా జైలర్ మూవీ ప్రమోషన్స్ లో ఆ మూవీ డైరెక్టర్ చేసిన ఒక కామెంట్ రజనీకాంత్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా చేసింది. రజని కాంత్ హీరో గా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం లో వచ్చిన జైలర్ మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యి రజని కాంత్ ఫాన్స్ తో పాటు సినీ అభిమానుల్లో ఫుల్ జోష్ ని నింపింది.
అసలు జైలర్ సినిమా మార్నింగ్ షో పడే వరకు ఎవరికీ సినిమా మీద పెద్దగా అంచనాలు లేవు. అందుకు కారణం కూడా ఉంది. రజనీకాంత్ కి 10 సంవత్సరాల నుంచి ఒక్క హిట్ సినిమా కూడా లేదు. అలాగే నెల్సన్ కుమార్ గత చిత్రం ఘోర పరాజయాన్ని చవిచూసింది. పైగా రజనికి నెల్సన్ డైరెక్షన్ లో సినిమా చేయద్దని చాలా మంది చెప్పారు . ఈ విషయాన్ని రజనీకాంతే స్వయంగా చెప్పాడు. కానీ రజనీకాంత్ నెల్సన్ మీద నమ్మకంతో ఈ మూవీ ని చేసాడు. రజని నమ్మకానికి తగ్గట్టే నెల్సన్ జైలర్ మూవీ ని సూపర్ గా తెరకెక్కించి ఇంత వరకు రజని ని ఎవరు చూపించని విధంగా చూపించి రజని ఫాన్స్ తో పాటు ప్రేక్షకులని మెస్మేరైజ్ చేసాడు.ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జైలర్ సినిమా సరికొత్త రికార్డులు సృష్టించే దిశగా వెళ్తుంది.
రజనీకాంత్ ఎంట్రన్స్ అండ్ కథలో ఆయన క్యారక్టర్ నడిచిన విధానం అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని సూపర్ సూపర్ హిట్ చేసాయి. ముఖ్యంగా నెల్సన్ డైరెక్షన్ ఒక రేంజ్ లో ఉంది. ఇప్పుడు నెల్సన్ జైలర్ మూవీకి సంబంధించి ఒక కొత్త అప్డేట్ ఇచ్చాడు. జైలర్ మూవీ కి పార్ట్ 2 ఉంటుందని ఆ కథ జైలర్ మూవీని మించి ఉంటుందని చెప్పాడు. ఈ న్యూస్ విన్న రజని ఫాన్స్ తో పాటు ప్రేక్షకులందరూ కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ సందర్భంగా ఇంకో విషయం కూడా నెల్సన్ చెప్పాడు. సూపర్ స్టార్ రజనీకాంత్అండ్ దళపతి విజయ్ కాంబినేషన్ లో మూవీ చెయ్యాలనేది తన కోరిక అని అది నెరవేరాలని కోరుకుంటున్నా అని చెప్పేసరికి నెల్సన్ అనుకున్నది జరగాలని రజని అండ్ విజయ్ ఫాన్స్ కోరుకుంటున్నారు. ఒక వేళ అదే కనుక జరిగితే తమిళ చిత్ర సీమ తో పాటు ఇండియన్ సినిమాకి అంతకంటే అదృష్టం ఉంటుందా?