గత మూడు సీజన్ లుగా ఘోర ప్రదర్శన చేస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ సారి జట్టులో భారీ మార్పులు చేయాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో హ్యారీ బ్రూక్ తో పాటు ఇద్దరు ఇండియన్ స్టార్ల మీద కూడా వేటు వేయనున్నట్లు సమాచారం.
ఐపీఎల్ లో సన్ రైజర్స్ పరిస్థితి ప్రతి సీజన్ కు దిగజారుతూ వస్తుంది. స్టార్టింగ్ లో అంచనాలు లేకుండా అదరగొట్టిన హైదరాబాదీ జట్టు ఇప్పుడేమో చెత్త ప్రదర్శనతో విమర్శలను మూట కట్టుకుంటుంది. ముఖ్యంగా చివరి మూడుసీజన్ లు చూసుకున్నట్లయితే ప్లే ఆఫ్ కి వెళ్లడం సంగతి పక్కన పెడితే పాయింట్ల పట్టికలో చివరి స్థానాల్లో ఉంటుంది. ఇక ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో 14 మ్యాచులకు గాను కేవలం 4 విజయాలతో చివరి స్థానంతో సరిపెట్టుకుంది. జట్టులో సీనియర్ల ప్లేయర్లను తొలగించి పూర్తిగా యువకులకు అవకాశం ఇచ్చి చేతులు కాల్చుకుంది. ఈ నేపథ్యంలో జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేయాలనీ భావిస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటికే ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు హ్యారీ బ్రూక్ మీద వేటు కన్ఫర్మ్ కాగా.. ఈ లిస్టులో మరో ఇద్దరు ప్లేయర్లు కూడా చేరనున్నట్లు తెలుస్తుంది.
2013 లో తొలి సారి అరంగ్రేటం చేసిన సన్ రైజర్స్.. పెద్దగా అంచనాలు లేకుండానే ప్లే చేరుకుంది. క్రమంగా హైదరాబాద్ జట్టులో డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్‌ను, జానీ బెయిర్‌స్టో, రషీద్ ఖాన్ లు చేరడంతో జట్టు పటిష్టంగా తయారైంది. వార్నర్ కెప్టెన్సీలో 2016 లో ఛాంపియన్ గా నిలిచిన సన్ రైజర్స్, 2018 లో విలియంసన్ నాయకత్వంలో ఫైనల్ కి చేరుకొని తుది మెట్టుపై బోల్తా పడింది. అయితే క్రమంగా కీలక ప్లేయర్లను వదులుకుంటూ వచ్చి భారీ మూల్యమే చెల్లించుకుంది. ముఖ్యంగా రషీద్ ఖాన్, వార్నర్, విలియంసన్ లను వదిలేసి వారి స్థానాల్లో యువ ప్లేయర్లకు అవకాశం ఇచ్చి చేయకూడని తప్పు చేసింది. దీంతో సన్‌రైజర్స్ ఓడిపోవడం, కావ్య ముఖం బాధతో నిండిపోవడం.. ఈ సీజన్ అంతా ఇదే రిపీటైంది. దీంతో ఇప్పుడు 13 కోట్ల భారీ ధరకు దక్కించుకున్న హ్యారీ బ్రూక్ మీద వేటు వేయనుండగా.. ఆల్ రౌండర్ వాషింగ్ టన్ సుందర్, స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్ కి కూడా ఉద్వాసన తప్పేలా లేదు.
గతేడాది గాయం కారణంగా మధ్యలోనే వైదొలిగిన సుందర్.. ఆడిన మ్యాచుల్లో ఏ మాత్రం ప్రభావం చూపించలేదు. ఇక ఉమ్రాన్ మాలిక్ వికెట్లు తీయకపోగా భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. తాజా సమాచార ప్రకారం వీరిద్దరిని వదిలేసుకునేందుకు సన్ రైజర్స్ యాజమాన్యం భావిస్తుందట. ఓపెనర్ మయాంక్ అగర్వాల్, త్రిపాఠి కూడా డేంజర్ జోన్ లో ఉన్నారనే చెప్పాలి. ఇప్పటికే హెడ్ కోచ్ బ్రియాన్ లారా మీద వేటు వేయనున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాగా ఐపీఎల్ 2024 కి సంబంధించిన మినీ వేలం ఈ ఏడాది డిసెంబర్ లో నిర్వహించనున్నట్లుగా బీసీసీఐ ఏర్పాట్లు చేస్తుంది. మొత్తానికి ఈ సారి సన్ రైజర్స్ టీంలో భారీ మార్పులు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ విషయంలో మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలపండి.