ఎస్.ఆర్.హెచ్.. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఐపీఎల్ లో ప్రాధాన్యం వహిస్తున్న ఒకే ఒక్క టీమ్. కావాల్సినంత ఫ్యాన్ బేస్ ఉన్నా విజయాల వేటలో వెనుకపడ్డ ఈ టీమ్ కు ఇప్పుడు కొత్త కోచ్ వచ్చారు. మరి.. కావ్య మారన్ ఏరికోరి తెచ్చిన ఆ కొత్త కోచ్ ఎవరో తెలుసా?
సన్ రైజర్స్ హైదరాబాద్.. ఐపీఎల్ లో దారుణమైన ప్రదర్శన చేసే టీమ్స్ లో ముందు వరుసలో ఉంటుంది. ఎప్పుడో 2016లో కప్ గెలిచాక.. మళ్ళీ సన్ రైజర్స్ మెరుపులు మెరిపించింది లేదు. ఈ జట్టు ఆట సంగతి పక్కన పెడితే.. స్టాఫ్ తీసుకునే నిర్ణయాలు మాత్రం ఎప్పుడూ గందరగోళంగా ఉంటాయి. బాగా ఆడే వార్నర్, కేన్ విలియమ్సన్ వంటి ప్లేయర్స్ ని వదులుకున్నారు. అస్సలు ప్రదర్శన బాగాలేని ఆటగాళ్లను మాత్రం ఇంకా అంటి పెట్టుకుని ఉన్నారు. ఇక మ్యాచ్ లు జరిగే సమయంలో వీరి వ్యూహాలు అత్యంత దారుణంగా, చెత్తగా కూడా ఉంటాయి. ప్రత్యర్థి గెలుపు కోసం వీళ్ళు కష్టపడుతున్నారా అన్నంతగా ఈ టీమ్ ప్రదర్శన ఉంటుంది.
దీంతో.. ఈ టీమ్ ఓనర్ కావ్య మారన్ కు తిప్పలు తప్పడం లేదు. ఆఖరికి రజనీకాంత్ లాంటి స్టార్ హీరో.. నీ బాధని చూడలేకపోతున్నా పాప అని అన్నారంటే.. సన్ రైజర్స్ వల్ల కావ్య పడుతున్న కష్టాలను అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే కావ్య పాప టీమ్ లో మార్పులు మొదలు పెట్టింది. సన్ రైజర్స్ కు కొత్త కోచ్ ని అనౌన్స్ చేసింది. క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా ఎస్.ఆర్.హెచ్ జట్టుకి కోచ్ గా ఉన్నారు. ఆయన స్థానంలో కొత్త కోచ్ అనగానే ముందుగా సెహ్వాగ్ పేరు తెరపైకి వచ్చింది. కానీ.., అందరినీ ఆశ్చరపరుస్తూ న్యూజిలాండ్ మాజీ ఆల్ రౌండర్ డానియల్ విటోరి రంగంలోకి వచ్చాడు. విటోరిని సన్ రైజర్స్ కొత్త కోచ్ గా నియమించింది కావ్య మారన్.
కెరీర్ లో 113 టెస్ట్ లు ఆడిన విటోరి 4531 రన్స్ చేసి, 362 వికెట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక 295 వన్డేల్లో 2253 పరుగులు చేసి.., ఏకంగా 305 వికెట్స్ సాధించడం విశేషం. ఇక ఇవన్నీ కాకుండా అప్పట్లో విటోరికి జెంటిల్మెన్ అన్న గుర్తింపు ఉండేది. కివీస్ జట్టులో ఇంతటి పోరాట పటిమ నింపిన కెప్టెన్స్ లో విటోరి కూడా ఒకరు. ఇలా ఆటలోని అన్ని విభాగాల్లో అనుభవం ఉన్న విటోరిని కోచ్ గా నియమించడంతో.. ఎస్.ఆర్.హెచ్ ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.