ఆరేళ్ల గ్యాప్ తర్వాత జట్టులోకి వచ్చి తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు సౌతాఫ్రికా క్రికెటర్ రిలీ రోసోవ్. ఇంగ్లండ్‌తో గురువారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో సంచలన ఇన్నింగ్స్‌తో దుమ్ములేపాడు. 55 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సులతో 96 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. కానీ.. తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికాకు ఎదురైన దారుణమైన ఓటమికి బదులుతీర్చుకుంటూ.. ఇంగ్లండ్‌పై మ్యాచ్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి సౌతాఫ్రికా.. రోసోవ్ చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 207 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్‌ను 149 పరుగులకే కుప్పకూల్చిన సౌతాఫ్రికా బౌలర్లు టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేశాడు. అద్భుత ఇన్నింగ్స్‌తో రాణించిన రిలీ రోసోవ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఆరేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన రిలీ తన సత్తా ఏంటో చాటి చెప్పాడు. ఆరేళ్ల తర్వాత సౌతాఫ్రికా తరపున బరిలోకి దిగి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన రోసోవ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.
కన్నీళ్లతో దేశాన్ని విడిచి..
రోసోవ్ జీవితం నిజంగా ఒక పోరాటం అని చెప్పొచ్చు. 2014లో సౌతాఫ్రికా జాతీయ జట్టు తరపున వన్డేల్లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన రిలీ రోసోవ్ ఆరంభ మ్యాచ్‌ల్లో మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కానీ.. కొన్ని మ్యాచ్‌ల తర్వాత దారుణంగా విఫలం అయ్యాడు. ఆడి తొలి 10 మ్యాచ్‌ల్లో 5 సార్లు డకౌట్ అయ్యాడు. దానికి తోడు గాయాలు అతని కెరీర్‌ను అంధకారంలోకి నెట్టేశాయి. దాంతో సౌతాఫ్రికా టీమ్‌లో చోటు కోల్పోయాడు.
తిరిగి జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది. ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు కౌంటీ క్రికెట్ వైపు అడుగులేసి సౌతాఫ్రికా జట్టుకే కాదు దేశానికే దూరమయ్యాడు. అక్కడ కూడా సరిగా ప్రదర్శన చేయలేదు. దీంతో తన చిన్ననాటి కోచ్ వద్దకెళ్లి తన ఆవేదనంతా వెల్లడించాడు. రోసోవ్ బలం, బలహీన తెలిసిన కోచ్.. అతన్ని టీ20 క్రికెట్‌పై దృష్టి సారించమని సూచిస్తాడు. కోచ్ సలహాతో పాకిస్థాన్ సూపర్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లలో అడుగుపెడతాడు.
ముఖ్యంగా పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్‌లో తొలుత క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టు తరపున 2017లో ఎంట్రీ ఇస్తాడు. ఒక ఆర్డినరి బ్యాటర్‌గా ఈ లీగ్‌లో అడుగుపెట్టిన రిలీ రోసోవ్.. ఇప్పుడు పీఎస్‌ఎల్ బెస్ట్ బ్యాటర్లలో ఒకడు. 2017 నుంచి 2019 సీజన్లలో క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టుకు ఆడిన రోసోవ్.. 2020 నుంచి ముల్తాన్ సుల్తాన్‌కు ఆడుతున్నాడు. పీఎస్‌ఎల్‌లో మొత్తం 52 మ్యాచ్‌లు ఆడిన రోసోవ్ 134.63 స్ట్రైక్‌రేట్‌తో 1139 పరుగులు చేశాడు. అందులో నాలుగు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ కూడా ఉంది. 41 సిక్సులు, 105 ఫోర్లు కొట్టాడు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 8వ స్థానంలో ఉన్నాడు.
2017లో కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సర్ఫరాజ్ అహ్మెద్‌తో కలిసి 100 ప్లస్ పార్ట్నర్‌షిప్ నమోదు చేశాడు. అందులో రిసోవ్ చేసిన పరుగులే 70 ఉన్నాయి. అలాగే 2020లో ముల్తాన్ సుల్తాన్ తరపున ఆడుతూ షాన్ మసూద్‌తో కలిసి 139 పరుగుల భాగస్వామ్య నెలకొల్పాడు. అదే మ్యాచ్‌లో రిలీ రోసోవ్ సెంచరీ కూడా బాదేశాడు. ఇలా పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్‌లో అద్భుతంగా రాణించిన రోసోవ్ తిరిగి సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌లో ఆడి.. జాతీయ జట్టు సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.
దీంతో అతన్ని ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌కు ఎంపిక చేశారు. తొలి మ్యాచ్‌లో 4 పరుగులే చేసి నిరాశ పర్చిన రోసోవ్.. రెండో టీ20లో అదరగొట్టాడు. ఇన్ని రోజులుగా జట్టుకు దూరమైన కసిని తన బ్యాటింగ్‌లో చూపించాడు. దీంతో రాబోయే టీ20 వరల్డ్ కప్ కోసం జట్టులో మిడిల్డార్ బ్యాటర్‌గా రోసోవ్ స్థానం సుస్థిరం కానుంది. కాగా.. సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ స్థానాన్ని భర్తీ చేయగల సామర్థ్యం రోసోవ్‌కు ఉందని సౌతాఫ్రికా క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. సౌతాఫ్రికా నుంచి కౌంటీలు ఆడి విమర్శలకు గురైన రోసోవ్.. ఇప్పుడు సౌతాఫ్రికా జట్టులో కీలక ఆటగాడిగా మారడం మధ్య చాలా స్ట్రగుల్ ఉంది. మరి ఇప్పటి వరకు సాగిన రోసోవ్ లైఫ్ జర్నీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rilee Rossouw`s 96 helps South Africa level series with 58-run win in Cardiff#RileeRossouw #ENGvSA pic.twitter.com/AbohkTKJ5E
— Sportz O’Clock (@Sportzoclock) July 29, 2022