సాధారణంగా డివిలియర్స్ కి బౌలింగ్ చేయడానికి ఏ బౌలర్ ఇష్టపడడు. మ్యాచ్ మొత్తం ఎంత బాగా బౌలింగ్ చేసినా ఈ మిస్టర్ 360 చేతికి చిక్కాడంటే ఒత్తిడిలో పడిపోవాల్సిందే. అయితే బ్యాటింగ్ లో ఇంత విధ్వంసం సృష్టించే డివిలియర్స్ ని భయపెట్టిన బౌలర్లు కూడా ఉన్నారట. వారిలో ఒకరు ఇండియన్ బౌలర్ కావడం గమనార్హం.
“ఏబీ డివిలియర్స్” ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రపంచ క్రికెట్ లో తన బ్యాటింగ్ ఒక సంచలనం. బరిలోకి దిగాడంటే ప్రత్యర్థులకు చుక్కలే. గ్రౌండ్ లో ఎటు వైపు షాట్ కొడతాడో బౌలర్లు ఒక అంచానాకి కూడా రాలేరు. నిలకడగా ఆడటంతో పాటు వేగంగా ఆడగలిగే అతి కొద్ది మందిలో డివిలియర్స్ ఒకడు. అందుకే అతి తక్కువ సమయంలోనే మిస్టర్ 360 గా పేరు తెచ్చుకొని ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్నాడు. ఇప్పుడంటే ప్రతి క్రికెటర్ ఇన్నోవేటివ్ షాట్స్ ఆడేందుకు ట్రై చేస్తున్నారు గాని ఒకప్పుడు ఇలాంటి తరహా షాట్స్ డివిలియర్స్ మాత్రమే సాధ్యం. అయితే అత్యున్నత ఫామ్ లో కొనసాగుతున్నప్పుడే డివిలియర్స్ రిటైర్మెంట్ ప్రకటించడం ప్రపంచ క్రికెట్ ని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే బ్యాటింగ్ లో ఇంత విధ్వంసం సృష్టించే డివిలియర్స్ ని భయపెట్టిన బౌలర్లు కూడా ఉన్నారట. వారిలో ఒకరు ఇండియన్ బౌలర్ కావడం గమనార్హం.
సాధారణంగా డివిలియర్స్ కి బౌలింగ్ చేయడానికి ఏ బౌలర్ ఇష్టపడడు. మ్యాచ్ మొత్తం ఎంత బాగా బౌలింగ్ చేసినా ఈ మిస్టర్ 360 చేతికి చిక్కాడంటే ఒత్తిడిలో పడిపోవాల్సిందే. అయితే ఎంత టాప్ బ్యాటర్ అయినా కొన్ని బలహీనతలు ఉంటాయి. ఈ విషయాన్ని ఎవరు కూడా బయటకి చెప్పుకోవడానికి ఇష్టపడరు. కానీ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత తమ మనసులోని భావాలను చెప్పుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. జియో సినిమాలో భారత మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్పతో కలిసి మాట్లాడుతూ ఏబీడీ ఈ విషయాన్ని తాను ఎదుర్కొన్న కష్టమైనా బౌలర్ ఎవరో చెప్పేసాడు. వారిలో ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ షేన్ వార్న్, రషీద్ ఖాన్ తో పాటు టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా కూడా ఉన్నాడు. వీరి గురించి డివిలియర్స్ ఎం చెప్పాడో ఇప్పుడు చూద్దాం.
“అంతర్జాతీయ క్రికెట్ లో నేను మొదటి సారి ఇబ్బంది పడ్డ బౌలర్ షేన్ వార్న్. 2006 లో ఆస్ట్రేలియా పర్యటకు వెళ్లినప్పుడు షేన్ వార్న్ బౌలింగ్‌లో ఆడడం బాగా ఇబ్బందిగా అనిపించింది. టెక్నిక్ మాత్రమే కాదు అతడి నీడ కూడా ప్రత్యర్థులను బయపెట్టేది. అతడి బౌలింగ్‌లో ఆడకుండగానే ఔటవుతాననే ఫీలింగ్ కలిగేది. ఇక టీమిండియా బౌలర్ బుమ్రా గురించి మాట్లాడుతూ.. “ఎల్లప్పుడూ పోటీనిస్తుంటాడు. ఎప్పుడూ బ్యాటర్లకు తలవంచడు. అందుకనే అతడంటే నాకు చాలా గౌరవం. మేమిద్దరం ఒకరి మీద మరొకరం ఆధిపత్యం చెలాయించుకునేవాళ్ళం”. అఫ్గనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఒక అటాకింగ్ బౌలర్. మేము మా ఇద్దరి మధ్య పోరు కూడా చాల ఆసక్తికరంగా ఉంటుంది. అయితే రాషేద్ ఖాన్ స్పెషల్ ఏంటంటే.. అతడి ఓవర్లో వరుసగా మూడు సిక్సర్లు కొట్టినా నాలుగో బంతికి నను అవుట్ చేసేందుకు ప్రయత్నించేవాడు”. అని డివిలియర్స్ తాను ఎదుర్కొన్న కష్టమైనా బౌలర్ల గురించి చెప్పుకొచ్చాడు.