2022 అక్టోబర్ నెలకు గాను విరాట్ కోహ్లీకి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు వచ్చిన తర్వాత.. మళ్లీ 2 నెలల తర్వాత మరో టీమిండియా క్రికెటర్‌కు ఆ అవార్డు వరించింది. ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డును భారత యువ క్రికెటర్ గెలుచుకున్నాడు.
ప్రతిష్టాత్మకమైన ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు టీమిండియా యువ స్టార్ క్రికెటర్‌ను వరించింది. గత కొంతకాలం టీమిండియా తరఫున అదరగొడుతూ.. అన్ని ఫార్మాట్లలోనూ తన మార్క్‌ను చూపిస్తూ.. భారత క్రికెట్‌కు బంగారు భవిష్యత్తులా కనిపిస్తున్నాడు. ఇండియన్ క్రికెట్ లెగసీని ముందుకు నడిపించబోయే మరో కోహ్లీ లాంటి ప్లేయర్‌గా మారుతున్న.. శుబ్‌మన్ గిల్‌కు జనవరి 2023 నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ప్రకటించింది. గిల్‌తో పాటు ఈ అవార్డు కోసం మరో టీమిండియా యువ క్రికెటర్, మన హైదరాబాదీ కుర్రాడు మొహమ్మద్ సిరాజ్, న్యూజిలాండ్ క్రికెటర్ డెవాన్ కావ్వె సైతం పోటీ పడ్డారు. ఈ ముగ్గురిలో అవార్డును గిల్ సొంతం చేసుకున్నాడు.
గత కొంత కాలంగా శుబ్‌మన్ గిల్ అద్భుత ఫామ్‌ను కనబరుస్తున్నాడు. టెస్టు క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న గిల్.. వన్డేల్లోనూ తన ఫామ్‌ను కొనసాగిస్తూ.. ఇటివల వన్డేల్లో డబుల్ సెంచరీ సైతం సాధించాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన ఐదో భారత క్రికెటర్‌గా సచిన్, సెహ్వాగ్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ సరసన నిలిచాడు. టెస్టులు, వన్డేల్లో తిరుగులేని బ్యాటింగ్‌తో సత్తా చాటుతున్న గిల్.. టీ20 ఫార్మాట్లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఐపీఎల్‌ల్లో ఓపెనర్‌గా మంచి ప్రదర్శనలే ఇస్తున్నా.. టీ20 క్రికెట్‌కు కావాల్సి ఆ వేగం, ప్రమాదకరమైన స్ట్రైక్‌రేట్ గిల్ బ్యాటింగ్‌లో లేదని, అతన్ని టీ20లకు పక్కన పెడుతూ.. వచ్చారు.
కానీ.. టెస్టులు, వన్డేల్లో అద్భుతంగా రాణిస్తున్న ఈ యువ క్రికెటర్ సేవలను మూడు ఫార్మాట్లలోనూ పొందాలని భావిస్తున్న బీసీసీఐ.. సీనియర్లకు రెస్ట్ ఇచ్చిన టీ20 సిరీస్‌లో గిల్‌కు ఓపెనర్‌గా అవకాశం కల్పించారు. వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకున్న గిల్.. ఏకంగా సెంచరీతో చెలరేగి తన సత్తా చాటాడు. ఇప్పుడు గిల్ మూడు ఫార్మాట్లలోనూ టీమిండియాకు కీలక ప్లేయర్‌గా మారాడు. జనవరిలో గౌహఠీలో జరిగిన మ్యాచ్ 70 రన్స్ చేసిన గిల్, తిరువనంతపురంలో 116, హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 208తో డబుల్ సెంచరీ బాదాడు.
అలాగే న్యూజిలాండ్‌తో ఇండోర్‌లో జరిగిన మ్యాచ్‌లో 112 మరో సెంచరీ సాధించాడు. తాజాగా ఫిబ్రవరి 1న న్యూజిలాండ్‌తో అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో 126 టీ20ల్లో తొలి సెంచరీ సాధించాడు. ఇలా జనవరిలో గిల్ సంచలన బ్యాటింగ్‌తో దుమ్ములేపి.. సిరాజ్, కాన్వెలను వెనక్కి నెట్టి ఐసీసీ అవార్డును సాధించాడు. అలాగే 2022 అక్టోబర్‌లో కోహ్లీకి ఈ వార్డు వచ్చింది. అతని తర్వాత ఈ అవార్డు సాధించిన భారత క్రికెటర్‌గా గిల్ నిలిచాడు. మరి ఈ అవార్డు గిల్‌కు రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
The India opener’s glorious ODI form has won him the prestigious ICC Men’s Player of the Month award for January 2023 🏅https://t.co/BLs029G3Z3
— ICC (@ICC) February 14, 2023