గతంలో సచిన్ కూతురు సారా టెండూల్కర్‌తో టీమిండియా యువ క్రికెటర్ శుబ్‌మన్ గిల్ డేటింగ్ చేసిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసకుని.. తమ రిలేషన్‌షిప్‌కు ఫుల్స్టాప్ కూడా పెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా శుబ్‌మన్ గిల్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌తో రిలేషన్షిప్లో ఉన్నట్లు తెలుస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్‌తో శుబ్‌మన్ గిల్ డేటింగ్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ.. వీరిద్దరూ దుబాయ్‌లోని ఒక రెస్టారెంట్లో డిన్నర్‌కు వెళ్లిన ఫొటోలు బయటికి వచ్చాయి. దీంతో శుబ్‌మన్ గిల్, సారా అలీ ఖాన్ డేట్ చేస్తున్నారంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.
కానీ.. వారిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో ఇంకా స్పష్టం కాలేదు. ప్రస్తుతం వారిద్దరూ రెస్టారెంట్లో కలిసున్న ఫొటో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఈ విషయంపై ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తే కానీ.. అసలు విషయం తెలియదు. గతంలో సారా టెండూల్కర్‌తో గిల్ డేటింగ్ చేసిన సమయంలో కూడా ఇద్దరూ తమ రిలేషన్‌షిప్‌పై స్పందించలేదు. కానీ.. సోషల్‌మీడియాలో ఒకరి ఫొటోలకు ఒకరు కామెంట్ చేసుకోవడం చేస్తుండేవారు. కానీ.. ఈ మధ్యనే ఏమైందో కానీ.. ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. ‘నా భవిష్యత్తు పట్ల నేను విధేయతతో ఉంటాను, నా గతానికి కాదు’ అని గిల్ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేయడంతో సారా టెండూల్కర్‌తో బ్రేకప్ గురించే ఇలా చెప్పాడాని అంతా అనుకున్నారు.
ఇప్పుడు సారా అలీ ఖాన్‌తో కొత్త రిలేషన్షిప్ మొదలుపెట్టేందుకే సారా టెండూల్కర్‌ను వదిలించుకున్నాడంటూ సోషల్ మీడియాలో పోస్టుల వర్షం కురుస్తుంది. ప్రస్తుతం గిల్ టీమిండియాలో లేడు. వెస్టిండీస్, జింబాబ్వే టూర్లలో అద్భుతంగా రాణించినా.. ఆసియా కప్ కోసం ఎంపిక కాలేదు. టెస్టు, వన్డే ఫార్మాట్ల కోసం టీమిండియాలో రెగ్యులర్ ప్లేయర్‌గా ఉన్నాడు. అలాగే సారా అలీ ఖాన్ తన సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. మరి వీరిద్దరూ దుబాయ్‌లో యాదృశ్చికంగా కలిశారా? లేక నిజంగానే రిలేషన్షిప్లో ఉన్నారా? అనే విషయం తెలియాల్సి ఉంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: హీరోయిన్‌కు మించిన అందాలతో సారా టెండూల్కర్!
Subhman Gill with Sara Ali Khan 👀
Dating ??? 🧐🧐#CricketTwitter #Viral pic.twitter.com/my2ffWgxNY— 𝐏𝐫𝐢𝐭𝐡𝐯𝐢𝐫𝐚𝐣 𝐒𝐢𝐧𝐡𝐚 🇮🇳🚩 (@Prithviraj7781) August 29, 2022
Loyal to my future, not my past.
.
.
.
.
.
.
Editor-in-chief: Ramesh Somani
Shot by: Tejas Nerurkar
Styled by: Simran Kabra
Assisted by: Yash Shah
Make-up by: Nitasha Wahi
Hair by: Team Aalim Hakim
Featured Gadget: DigitekFull Look: Rajesh Pratap Singh
Chain: Drip Project pic.twitter.com/l8KNGqApEG— Shubman Gill (@ShubmanGill) August 23, 2022