క్రీడల్లో రికార్డ్ లకు ఆయుష్షు తక్కువ అన్న సామెత మనందరికి తెలిసిందే. ఇక క్రికెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీ20 క్రికెట్ వచ్చిన దగ్గరి నుంచి రోజుకో రికార్డ్ బద్దలు అవుతుంది. ఇక ప్రస్తుతం టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనలో ఉంది. ఈ క్రమంలోనే ప్రారంభం అయిన తొలి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. టీమిండియా బ్యాటర్లు బౌలర్లు చెలరేగడంతో బంగ్లా టీమ్ ముందు 513 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ ఉంచింది. ఈ మ్యాచ్ లో తన డెబ్యూ సెంచరీ సాధించిన టీమిండియా ఓపెనర్ శుభ్ మన్ గిల్ ఓ అరుదైన రికార్డ్ నెలకొల్పాడు.
శుభ్ మన్ గిల్.. టీమిండియాలోకి అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే మంచి ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కంటిన్యూస్ గా పరుగులు సాధిస్తూ.. తన స్థానాన్ని జట్టులో సుస్థిరం చేసుకుంటున్నాడు. తాజాగా బంగ్లాతో జరుగుతున్న తొలి టెస్ట్ లో 152 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్ లతో 110 పరుగులు చేశాడు. టెస్టుల్లో గిల్ కు ఇదే తొలి శతకం కావడం విశేషం. ఈ క్రమంలోనే గిల్ ఓ అరుదైన రికార్డ్ ను తన పేరిట లిఖించుకున్నాడు. 2022లో టెస్ట్ క్రికెట్ లో సెంచరీ చేసిన తొలి టీమిండియా ఓపెనర్ గా అరుదైన ఘనత సాధించాడు. ఇప్పటి వరకు ఈ ఏడాదిలో ఏ ఇండియన్ ఓపెనర్ సెంచరీ సాధించకపోవడం గమనార్హం.
ఈ ఏడాది ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ లో పుజారా ఓపెనర్ గా 66 పరుగులు చేయగా.. సౌతాఫ్రికా తో టెస్ట్ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ 50 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్ లో శుభ్ మన్ గిల్, పుజారాలు సెంచరీలతో చెలరేగడంతో టీమిండియా 513 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. ఇక భారత్ తన రెండో ఇన్నింగ్స్ ను 258 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లా జట్టు వికెట్ నష్టపోకుండా 42 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 404 పరుగులు చేయగా.. బంగ్లా 150 రన్స్ కే కుప్పకూలింది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉండటంతో ఈ మ్యాచ్ లో ఫలితం కచ్చింతంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Maiden Test hundred for a special cricketer for the future – Shubman Gill. pic.twitter.com/G6i0OPWErR
— Johns. (@CricCrazyJohns) December 16, 2022