పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, పంత్, కేఎల్ రాహుల్ లాంటి స్టార్లు లేని టీమిండియా విండీస్‌పై 300పై చిలుకు పరుగులు చేసి అదరగొట్టింది. ఈ మ్యాచ్‌లో వన్‌డౌన్ బ్యాటర్‌గా వచ్చిన శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో రాణించాడు.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్ ధాటిగా ఆడి తొలి వికెట్‌కు 119 పరుగుల భారీ భాగస్వామ్యం అందించారు. నికోలస్ పూరన్ అద్భుత ఫీల్డింగ్‌తో శుభ్ మన్ గిల్ (64పరుగులు) రనౌట్ కావడంతో తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయస్ అయ్యార్ తొలుత నిదానంగా ఆడాడు. మరోపక్క ధావన్ ధాటిగా ఆడుతున్నాడు. కాస్త కుదురుకున్నాక శ్రేయస్ కూడా తన గేర్ మార్చాడు.
జైడెన్ సీల్స్ బౌలింగ్లో ఫోర్ కొట్టి టచ్‌లోకి వచ్చాడు. నికోలస్ పూరన్ బౌలింగ్‌లో రెండు భార్ సిక్సులు, ఒక ఫోర్ బాది స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఇక ధావన్‌తో కలిసి 94పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ధావన్ (97పరుగులు) ఔటయ్యాక.. శ్రేయస్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. 57 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లుతో 54 పరుగులు చేసి ఔటయ్యాడు.
అయితే ఈ ఇన్నింగ్స్‌తో శ్రేయస్ అయ్యార్ వన్డేల్లో అత్యంత వేగంగా 1000పరుగులు చేసిన మూడో భారత బ్యాటర్‌గా నిలిచాడు. 50 ఓవర్ల ఫార్మాట్‌లో తన 25వ ఇన్నింగ్స్‌లో శ్రేయస్ 1000 పరుగుల మైలురాయి చేరుకున్నాడు. తద్వారా 25ఇన్నింగ్స్‌లలో 1000పరుగులు చేసిన మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూతో కలిసి ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతకుముందు భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, శిఖర్ ధావన్ 24ఇన్నింగ్స్‌లలో 1000పరుగులు పూర్తి చేసి అయ్యర్ కంటే ముందు నిలిచారు. మరి ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Shreyas Iyer got to the milestone in his 25th ODI innings.#WIvIND #WIvsIND #ShreyasIyer https://t.co/mK0Njs8KNK
— India Today Sports (@ITGDsports) July 22, 2022