హైఓల్టేజ్ మ్యాచ్‌కు మారుపేరు ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్. క్రికెట్లో ఈ రెండు దేశాలు తలపడుతున్నాయంటే ప్రపంచలోని క్రికెట్ ఫ్యాన్స్ మొత్తం కళ్లప్పగించేస్తారు. భారత్-పాక్ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ అలాంటిది మరి. చాలా కాలంగా ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు లేకపోవడంతో.. కేవలం ఐసీసీ మెగా టోర్నీల్లోనే దాయాదుల పోరు చూసే అవకాశం దక్కుతుంది.
ఈ నేపథ్యంలో గతేడాదిలో జరిగిన టీ20 వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్‌లో తలపడిన భారత్-పాకిస్థాన్.. యూఏఈ వేదికగా ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్‌లో ఢీకొననున్నాయి. 28న ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌పై ఇప్పటికే ఒక రేంజ్లో హైప్ క్రియేట్ అయింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ భారత్-పాక్ మ్యాచ్‌పై స్పందించాడు.
భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడు జరిగినా భారీ ఆదరణ ఉంటుందని.. ఈ రెండు దేశాల మధ్య ఉన్న పరిస్థితుల కారణంగా హైప్ ఉంటుందని అన్నాడు. సెహ్వాగ్ మాట్లాడుతూ.. ‘భారత్-పాక్ మధ్య జరిగిన ఒక మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్‌ను ఆఫ్రిది పదే పదే తిడుతున్నాడు. అప్పుడు నేను సచిన్‌కు బై రన్నర్‌గా ఉన్నాను. సాధారణంగా సచిన్ బై రన్నర్‌ను తీసుకోడు.
కానీ.. నేను రన్నర్‌గా ఉంటే తనకు ఇబ్బంది ఉండదని, తనకు నాకు మధ్య మిస్ అండర్స్టాండింగ్ జరగదనే నమ్మకంతో ఆ మ్యాచ్‌లో సచిన్ బై రన్నర్ తీసుకున్నాడు. నేను క్రీజ్‌లోకి వచ్చే సమయానికే షాహిద్ ఆఫ్రిది.. సచిన్‌ను తిడుతున్నాడు. కానీ సచిన్ మాత్రం అది పట్టించుకోకుండా ఏకాగ్రతతో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఎందుకంటే సచిన్ క్రీజ్‌లో ఉండటం టీమిండయాకు ఎంతో అవసరం. ఆ విషయం అందరికంటే సచిన్‌కే బాగా తెలుసు.
అందుకే తిట్లతో ఆఫ్రిది ఎంత కవ్విస్తున్నా, సచిన్ ఫోకస్‌ను దెబ్బతియాలని చూస్తున్న సచిన్ మాత్రం బ్యాటింగ్‌పైనే పూర్తిగా దృష్టి పెట్టాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటే మాకు కూడా ఎంతో ఒత్తిడి ఉంటుంది. కానీ.. సచిన్ అలా కాదు. జట్టుకు తన అవసరం ఎంతుందో అతని బాగా తెలుసు అందుకే అతను మిగతావి పట్టించుకోడు.’ అని సెహ్వాగ్ వెల్లడించాడు.
నిజానికి వివాదరహితుడిగా సచిన్‌కు క్రికెట్లో మంచి పేరుంది. మైదానంలో తనను కావాలని ప్రత్యర్థి ఆటగాళ్లు రెచ్చగొట్టిన సచిన్ అనవసరపు పంతాలకు పోయి వికెట్ పారేసుకోడు. జట్టు పరిస్థితులకు తగ్గట్టు తన పని తాను చేసుకుంటూ పోతాడు. అందుకే సచిన్ ప్రపంచ క్రికెట్లో ఒక లెజెండ్ అయ్యాడు. ఇండియన్ క్రికెట్‌కు గాడ్ అయ్యాడు. మరి సచిన్ సహనం, ఏకాగ్రతపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
A never-heard-before story, this one#VirenderSehwag #SachinTendulkar #ShahidAfridi #INDvPAK #AsiaCup https://t.co/uHtNNcFA53
— HT Sports (@HTSportsNews) August 17, 2022
ఇది కూడా చదవండి: భారీ భారీ ఎక్సర్సైజ్లు చేస్తున్న కోహ్లీ! పాకిస్థాన్‌కు మూడినట్టే