టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సూపర్ ఫిట్‌గా ఉంటాడనే విషయం తెలిసిందే. ప్రతిరోజు ఒక నిర్దిష్ట సమయం జిమ్‌లో చెమటలు చిందిస్తాడు. అందుకే మైదానంలో చిరుతపులిలా పరిగెడుతుంటాడు. ప్రస్తుతం క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకుని విశ్రాంతిలో ఉన్న కోహ్లీ.. ఆసియా కప్‌లో భాగంగా ఈ నెల 28న పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌తో బరిలోకి దిగనున్నాడు. గత కొంతకాలంగా కోహ్లీ తన స్థాయి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. దీంతో కొంత విశ్రాంతి తీసుకుని ఫామ్ పుంజుకోవడంపై ఫోకస్ పెడుతున్నాడు కోహ్లీ. అందులో భాగంగానే జిమ్‌లో భారీ భారీ ఎక్సర్సైజ్లు చేస్తూ.. తొలుత బాడీ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టినట్లు కనిపిస్తున్నాడు. జిమ్‌లో భారీ వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్న ఒక వీడియోను కోహ్లీ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేశాడు. ప్రస్తుతం కోహ్లీ జిమ్‌లో కష్టపడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోహ్లీ భారీ బరువులు ఎత్తుతున్న వీడియోను చూసిన క్రికెట్ అభిమానులు.. కోహ్లీ ఈ రేంజ్లో కష్టపడుతున్నాడంటే ఇక పాక్‌తో మ్యాచ్‌లో చెలరేగిపోతాడని అంటున్నారు. మరికొంత మంది నెటిజన్లు.. విరాట్ కోహ్లీ వెయిట్ లిఫ్టింగ్‌లో ఇండియాకు గోల్డ్ మెడల్ తెచ్చేలా ఉన్నాడంటూ కామెంట్ చేస్తున్నారు. మరి కోహ్లీ ఫిట్‌నెస్‌పై, జిమ్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ️♂️ pic.twitter.com/NOvAD9uutT — Virat Kohli (@imVkohli) August 17, 2022