భారత్ లో క్రికెట్ ఒక మతమైతే.. దానికి దేవుడు ‘సచిన్ టెండూల్కర్‘. 16 ఏళ్ల వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సచిన్ రమేశ్ టెండూల్కర్.. 24 ఏళ్ల పాటు తన అద్బుత ఆటతో క్రికెట్ ఫ్యాన్స్ ను అలరించాడు. సచిన్ క్రీజులో ఉన్నాడంటే.. కోట్లాది మంది అభిమానులు కళ్లప్పగించి చూస్తుండే వాళ్లు. అలా రెండు దశాబ్దాలపాటు టీమిండియా క్రికెట్‌కు ఎనలేని సేవలందించిన సచిన్ అనేక రికార్డులను కొల్లగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్ లో 200 టెస్టు మ్యాచులాడిన సచిన్.. 15921 పరుగులు చేశాడు. ఇందులో 51 సెంచరీలు ఉండగా, హైయెస్ట్ స్కోర్ 248. ఇక.. వన్డేల విషయానికొస్తే.. 463 వన్డేలాడిన సచిన్ 18426 పరుగులు చేశాడు. ఇందులో 49 సెంచరీలు ఉండగా, హైయెస్ట్ స్కోర్ 200. టెస్టులు, వన్డేలు కలిపి 663 మ్యాచులాడిన సచిన్ 100 సెంచరీలు చేయడం విశేషం. సచిన్ ఖాతాలో 100 వికెట్లు కూడా ఉన్నాయండి.
రెండు దశాబ్దాలపాటు క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన సచిన్ తన ఆల్ టైం బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ క్రికెట్ టీంను ప్రకటించాడు. అందులో నలుగురు టీమిండియా ఆటగాళ్లకు చోటు కల్పించిన సచిన్.. తన జట్టులో తనకు చోటు కల్పించుకోకపోవడం గమనార్హం. తన జట్టుకు సౌరవ్ గంగూలీని కెప్టెన్ గా నియమించిన సచిన్.. ఓపెనర్లుగా.. వీరేంద్ర సెహ్వాగ్, సునీల్ గవాస్కర్‌లను ఎంపిక చేశాడు. కీపర్ గా ఆడమ్ గిలిక్రిస్ట్, మిడిల్ ఆర్డర్ లో బ్రియాన్ లారా, వివ్ రిచర్డ్స్, జాక్వెస్ కల్లిస్, సౌరవ్ గంగూలీ వంటి దిగ్గజాలలో చోటు కల్పించాడు. ఇక.. బౌలర్ల విషయానికొస్తే.. హర్భజన్ సింగ్, షేన్ వార్న్, వసీం అక్రమ్, గ్లెన్ మెక్‌గ్రాత్ లను ఎంచుకున్నాడు.
Kings are Temporary God is Permanent.@sachin_rt pic.twitter.com/8YaGstgiJb
— Sachinist (@Sachinist) May 13, 2022
Outlook Cover featuring Sachin Tendulkar , Sourav Ganguly and Rahul Dravid pic.twitter.com/PY99E1QaPl
— Debankan Mukherjee (@DebankanMukher1) May 6, 2022
సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ XI
వీరేంద్ర సెహ్వాగ్, సునీల్ గవాస్కర్, బ్రియాన్ లారా, వివ్ రిచర్డ్స్, జాక్వెస్ కలిస్, సౌరవ్ గంగూలీ, ఆడమ్ గిల్‌క్రిస్ట్, షేన్ వార్న్, వసీం అక్రమ్, హర్భజన్ సింగ్, మరియు గ్లెన్ మెక్‌గ్రాత్
சச்சின் டெண்டுல்கர் ALL TIME BEST XI ஐ தெரிவு செய்துள்ளார்
Sachin Tendulkar’s all-time XI
Virender Sehwag
Sunil Gavaskar
Brian Lara
Viv Richards
Jacques Kallis
Sourav Ganguly (C)
Adam Gilchrist
Shane Warne
Wasim Akram
Harbhajan Singh
Glenn McGrath.— Thanujan (@ThanujanUK) May 12, 2022