టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో బిజీగా ఉన్నాడు. భారత్-వెస్టిండీస్ మధ్య నాలుగో టీ20 మ్యాచ్ అమెరికాలోని ఫ్లోరిడాలో జరగనుంది. కాగా మూడో టీ20 సందర్భంగా గాయంతో బ్యాటింగ్ మధ్యలోనే రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన రోహిత్.. నాలుగో మ్యాచ్ ఆడతాడా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ.. శుక్రవారం ప్రాక్టీస్ సెషన్‌లో రోహిత్ నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు. దీంతో రోహిత్ నాలుగో మ్యాచ్‌లో ఆడుతున్నట్లు తేలిపోయింది.
ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ వైరల్‌గా మారింది. ఆ ఇంటర్వ్యూలో రోహిత్ రిపోర్టర్‌పై సీరియస్ అయ్యాడు. రోహిత్ శర్మ ఫిట్‌నెస్, అధిక బరువుపై రిపోర్ట్ అడిగిన ప్రశ్నకు రోహిత్‌కు కోపం తెప్పించినట్లు సమాచారం. ‘క్రికెట్‌లో మనం ఎలా కనిపిస్తున్నాం అన్నది ముఖ్యం. మీరు బాగా అందంగా కనిపించాలనుకుంటే.. సినిమాల్లో ట్రై చేసుకోవాలి’ అంటూ రిపోర్టర్‌కు గట్టి కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. కాగా రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై మొదటి నుంచే అనేక విమర్శలు ఉన్న విషయం తెలిసిందే.
అతను తరచు గాయపడుతుండటం, గ్రౌండ్‌లో వేగంగా పరిగెత్తలేకపోవడంతో రోహిత్‌ను వడాపావ్ అంటూ కూడా కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంటారు. తాజాగా వెస్టిండీస్‌తో మూడో టీ20 సందర్భంగా వీపు కండరాలు పట్టేయడంతో రోహిత్ రిటైర్డ్ హర్ట్‌గా క్రీజ్ వీడాడు. బహుష ఇదే విషయంపై రిపోర్టర్ రోహిత్‌ను ప్రశ్నించి ఉంటాడని.. అందుకు రోహిత్ కోపంతో పై విధంగా స్పందించి ఉంటాడంటూ సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: సూర్యకుమార్ యాదవ్ కోసం రోహిత్ శర్మ మాస్టర్ ప్లాన్!