మిడిల్డార్ బ్యాటర్లుగా వచ్చి.. ఓపెనర్‌గా సక్సెస్ అయిన స్టార్ క్రికెటర్లు టీమిండియాలో చాలా మందే ఉన్నారు. కొంతమంది జట్టు అవసరాల కోసం ఓపెనర్లుగా మారితే.. మరికొంతమందిని జట్టు కెప్టెన్లు గుర్తించడంతో ఓపెనర్లు అయ్యారు. ఇలా కెప్టెన్లు గుర్తించి, ప్రొత్సహించడంతో ఓపెనర్లు అయిన వారిలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందు వరుసలో ఉంటారు. సెహ్వాగ్ కెరీర్ ఆరంభంలో మిడిల్డార్‌లో బ్యాటింగ్‌కు వచ్చేవాడు. కానీ అంతగా రాణించలేదు. దీంతో సెహ్వాగ్‌లోని స్పార్క్‌ను గమనించిన అప్పటి టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన స్థానాన్ని త్యాగం చేసి మరీ సచిన్‌కు జోడీగా సెహ్వాగ్‌ను ఓపెనర్‌గా పంపించాడు. అంతే సెహ్వాగ్ దశ తిరగిపోయింది. ఓపెనర్‌గా సెహ్వాగ్ పరుగుల వరదపారించాడు. ఇక ఆ తర్వాత యంగ్ టాలెంటెడ్ ప్లేయర్ టీమిండియాలోకి ఎప్పుడో అరంగేట్రం చేసిన రోహిత్.. జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకోలేకపోయాడు. Suryakumar Yadav - is the best Indian batsman in T20I currently. #IndvWI pic.twitter.com/VVadVLc9nz — Johns. (@CricCrazyJohns) August 2, 2022 టాలెంట్, టెక్నిక్కు కొదవలేకున్నా.. పరుగులు మాత్రం అంతగా చేయలేకపోయాడు. దీంతో అప్పటి కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని రోహిత్ శర్మ 2013 ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా ఓపెనర్‌గా ప్రయోగించాడు.. అంతే ఒక కొత్త రోహిత్ శర్మను ప్రపంచ క్రికెట్ చూసింది. ఇక అక్కడి నుంచి రోహిత్ శర్మ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ప్రపంచ క్రికెట్లో వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ 264 పరుగులు రోహిత్ శర్మ ఓపెనర్‌గానే సాధించాడు. ఇలా మిడిల్డార్ బ్యాటర్లుగా ఇబ్బంది పడిన సెహ్వాగ్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా మారిన తర్వాత వారి ఆట పూర్తిగా మారింది. Suryakumar Yadav's T20i Ranking after: - 1st match - 1,178th. - 5th match - 77th. - 10th match - 60th. - 15th match - 49th. - 20th match - 4th. - 22nd match - 2nd. — Mufaddal Vohra (@mufaddal_vohra) August 3, 2022 ఇప్పుడు తన సక్సెస్ ఫార్ములాను రోహిత్ శర్మ- సూర్యకుమార్ యాదవ్‌పై ప్రయోగిస్తున్నాడు. మిడిల్డార్‌లో సూర్యకుమార్ యాదవ్ మంచి ప్రదర్శన కనబరుస్తున్నా.. టీమిండియా ఒక డాషింగ్ ఓపెనర్‌ను అందించేందుకు సూర్యకుమార్‌ను ఓపెనర్‌గా రోహిత్ ప్రమోట్ చేస్తున్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో సూర్యకుమార్ యాదవ్ విఫలమైనా.. మూడో మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. దీంతో టీమిండియాకు టీ20 వరల్డ్ కప్‌కోసం ఒక డాషింగ్ ఓపెనర్ దొరికాడనే ఆశలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ రూపంలో ఓపెనర్లు ఉన్నా.. ఈ ఇద్దరు గాయాలతో జట్టుకు ఎప్పుడు దూరం అవుతారో తెలియదు. Suryakumar Yadav storms to the second position in the latest ICC T20I rankings & only trailing by top position by three points pic.twitter.com/5JBkRcEvZP — CricTracker (@Cricketracker) August 3, 2022 అందుకే సూర్యకుమార్ యాదవ్‌ను ఓపెనర్‌గా పర్మినెంట్ చేసి.. రాహుల్‌ను మిడిల్డార్‌లో ఆడించేందుకు రోహిత్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇలా సెహ్వాగ్ విషయంలో గంగూలీ, రోహిత్ శర్మ విషయంలో ధోని అనుసరించిన వ్యూహంతో టీమిండియాకు ఇద్దరు గొప్ప ఓపెనర్లు టీమిండియాకు దొరికినట్లు. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ విషయంలో రోహిత్ చూపిస్తున్న చొరవతో టీమిండియాకు మరో ఓపెనర్ దొరికే అవకాశం ఉంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. Suryakumar Yadav masterclass yesterday night - one of the finest currently in world cricket. pic.twitter.com/GXxYJcVak2 — Mufaddal Vohra (@mufaddal_vohra) August 3, 2022 ఇదీ చదవండి: న్యూజిలాండ్ క్రికెటర్ ఆడిన భారీ షాట్‌కు చిన్నారి తలకు గాయం! వెంటనే.. ఇదీ చదవండి: ‘ఇండియా.. ఇండియా’! వైరల్‌గా మారిన ఆసియా కప్ ప్రమోషనల్ వీడియో