ఐపీఎల్-15 లీగ్ లో భాగంగా బెంగళూరు రాయల్ చాలెంజర్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. శనివారం జరిగిన పోరులో ఆర్‌సీబీ 7 వికెట్లతో ముంబైని ఓడించింది. అయితే మ్యాచ్ జరుగుతున్న క్రమంలో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ముంబై టీమ్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఓ అభిమాని భద్రత సిబ్బందిని తప్పించుకుని మైదానంలోకి ప్రవేశించాడు. అభిమాని హగ్ ఇవ్వమని రోహిత్ వైపు పరిగెత్తాడు. దీంతో అభిమానికి ఎయిర్ హగ్ ఇచ్చి.. రోహిత్ అందరిని ఆకట్టుకున్నాడు. అది చూసిన విరాట్ కోహ్లీ చప్పట్లు కొడుతూ మెచ్చుకోవడం కనిపించింది.
మ్యాచ్ విషయంలోకి వెళ్తే..శనివారం పూణెలోని MCA స్టేడియంలో ముంబై, బెంగుళు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 68 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు అర్ధ సెంచరీతో చెలరేగండో ముంబై ఇండియన్స్ కి ఆ స్కోర్ సాధించింది. రోహిత్ శర్మ (15 బంతుల్లో 26; 4 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడగా, ఇషాన్ కిషన్ (26; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు.
అనంతరం బెంగళూరు 18.3 ఓవర్లలో 3 వికెట్లకు 152 పరుగులు సాధించింది. “ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్” అనూజ్ రావత్ (47 బంతుల్లో 66), విరాట్ కోహ్లి (36 బంతుల్లో 48) రెండో వికెట్‌కు 80 పరుగులు (52 బంతుల్లో) జోడించి జట్టు విజయాన్ని సునాయాసంగా మార్చారు. ముంబై ఫీల్డింగ్ సమయంలో గ్రౌండ్ లోకి ఓ అభిమాని చోరబడ్డాడు. అతను రోహిత్ వైపు పరిగెత్తాడు. దీంతో అభిమానిని నిరాశపెట్టకుండా.. కోవిడ్ మిత్రమ అందుకు ఇలా హగ్గు తీసుకో అంటూ ఎయిర్ హగ్ ఇచ్చాడు. అది చూసిన కింగ్ విరాట్ కోహ్లీ చప్పట్లు కొడుతూ మెచ్చుకోవడం కనిపించింది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.