టీమిండియా సారధిగా.. కొత్తగా పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. రోహిత్ కెప్టెన్ గా ఎంపికయ్యాక..న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్, విండీస్‌తో వన్డే, టీ20 సిరీస్, శ్రీలంకతో టీ20 సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు, లంకతో టెస్టు సిరీస్‌కి సన్నద్ధమవుతోంది. ఇప్పటివరకు హిట్ మ్యాన్ అంటే.. కూల్ అండ్ కామ్ అనేవారు. ఇప్పుడు ట్రెండ్ మార్చేశాడు. మంగళవారం(మార్చి 1) ట్విట్టర్లో.. ట్వీట్ల వర్షం కురిపించిన రోహిత్ శర్మ.. ఇవాళ మరో వార్తతో అభిమానులను అలరిస్తున్నాడు. హిట్ మ్యాన్ అత్యంత ఖరీదైన లంబోర్గినీ ఉరుస్ ఎస్‌యూవీని కొనుగోలు చేశారు.
రోహిత్ శర్మ.. ఇటాలియన్ కార్ల తయారీ కంపెనీ లంబోర్ఘినికి చెందిన ‘ఉరుస్’ మోడల్ కారును కొనుగోలు చేశారు. ఎస్‌యూవీ ఉరుస్ మోడల్..అత్యంత విలాసవంతమైన కార్లలో ఒకటిగా ఉంది. ఇప్పటికే.. జూనియర్ ఎన్టీఆర్, రణవీర్ సింగ్, కార్తీక్ ఆర్యన్, రోహిత్ శెట్టి, వంటి ప్రముఖులు ఈ లగ్జరీ ఎస్‌యూవీని కలిగి ఉన్నారు. హిట్ మ్యాన్ ఈ కారుకు తనకు నచ్చినట్లుగా పలు అధునాతన మార్పులు చేపించుకున్నారట. దేశంలో.. లంబోర్గినీ ఉరస్ ధర రూ. 3.15 కోట్లు (ఎక్స్-షోరూమ్). అయితే.. మార్పుల తరువాత రోహిత్ భారీగానే చెల్లించినట్లు తెలుస్తోంది.
లంబోర్ఘిని ‘ఉరుస్’ మోడల్.. స్పోర్ట్స్, సర్ఫేస్ క్వాలిటీ కార్ అంటున్నారు. అంటే కేవలం రోడ్ల మీద మాత్రమే కాదు.. దట్టమైన ఎడారి ప్రాంతంలో కూడా దూసుకుపోగలదని అర్థం. అంతేకాకుండా.. కొండ ప్రాంతంలో కూడా ఎలాంటి సమస్య లేకుండా రైడ్ చేయచ్చు అంటున్నారు. ఏదేమైనా.. రోహిత్ శర్మ కొత్త కారు గురించి చర్చ బాగానే జరుగుతుంది. టీమిండియా జెర్సీ రంగులో మెరిసిపోతున్న ఈ కారు ఫోటోలను అభిమానులు పోస్టు చేస్తూ.. కంగ్రాట్స్ చెప్తున్నారు. ముంబైలోని లంబోర్ఘిని షోరూం ఇప్పటికే ఈ కారును రోహిత్ ఇంటికి డెలివరీ చేసినట్టు సమాచారం.
మరోవైపు.. రోహిత్ శర్మ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు తెలుస్తోంది. క్రికెట్ బాల్స్ ని తినొచ్చు.. కరెక్టేనా?.. నీకు తెలుసా? సందడి చేసే తేనెటీగలు గొప్ప బాక్సింగ్ బ్యాగ్‌లను తయారు చేస్తాయి..ఇలా హిట్ మ్యాన్ ట్విట్టర్ ఖాతా నుంచి అర్థం పర్థం లేని ట్వీట్లు వస్తుండటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.