టీమిండియా యువ క్రికెటర్ రిషభ్ పంత్ ప్రస్తుతం బ్యాడ్ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. పట్టుమని పది పరుగులు చేసేందుకు నానాతంటాలు పడుతున్నాడు. టీ20 వరల్డ్ కప్ 2022 కంటే ముందు నుంచే ఫామ్ కోల్పోయిన రిషభ్ పంత్‌ను.. ఒక లెఫ్ట్ హ్యాండర్ జట్టులో ఉండాలనే ఉద్దేశంతో వరల్డ్ కప్ టీమ్‌లోకి తీసుకున్నారు. కానీ.. వరల్డ్ కప్‌లో పెద్దగా అవకాశాలు ఇవ్వలేదు. సూపర్ 12లో జింబాబ్వేతో జరిగిన చివరి మ్యాచ్‌లో అలాగే సెమీ ఫైనల్‌లో పంత్‌కు అవకాశం ఇచ్చినా అతను రాణించలేకపోయాడు. అయినా కూడా పంత్‌ను వరల్డ్ కప్ తర్వాత న్యూజిలాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లతో పాటు బంగ్లాదేశ్‌తో ఆడే వన్డే, టెస్టు సిరీస్‌లకు ఎంపిక చేశారు. టెస్టుల్లో అద్భుతంగా ఆడుతున్న పంత్.. వైట్‌బాల్ క్రికెట్‌లో మాత్రం దారుణంగా విఫలం అవుతున్నాడు.
టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని వారసుడిగా టీమిండియాలోకి వచ్చిన రిషభ్ పంత్ తన ఎటాకింగ్ బ్యాటింగ్‌తో అతి తక్కువ కాలంలోనే జట్టులో కీ ప్లేయర్‌గా మారిపోయాడు. టెస్టుల్లో అద్భుతంగా ఆడుతున్న పంత్.. తన బ్యాటింగ్‌కు సరిపోయే టీ20ల్లో మాత్రం విఫలం అవుతున్నాడు. పంత్ ఎంత కీలకమైన ఆటగాడో తెలిసిన కెప్టెన్ రోహిత్ శర్మ.. అతన్ని బ్యాక్ చేశాడు. వరల్డ్ కప్ ముందు ఫామ్‌లో లేకపోయినా.. వెస్టర్న్ ఆస్ట్రేలియాతో జరిగిన రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లోనూ పంత్‌ను ఓపెనర్‌గా పంపించాడు. అయినా కూడా పంత్ పరుగులు చేయలేకపోయాడు. ఆ తర్వాత వరల్డ్ కప్ సూపర్ 12లో తొలి నాలుగు మ్యాచ్‌ల్లో పంత్‌స్థానంలో దినేష్ కార్తీక్‌ను ఆడించిన రోహిత్.. అతను గాయపడ్డంతో పంత్‌కు ఛాన్స్ ఇచ్చాడు.
అయినా కూడా పంత్ ఫామ్ అందుకోలేకపోయాడు. తాజాగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లోనూ పంత్ విఫలం అయ్యాడు. అంతకుముందు జరిగిన టీ20 సిరీస్‌లోనూ విఫలమైన పంత్.. తొలి వన్డేలో 23 బంతుల్లో 15 పరుగులు, చివరి వన్డేలో 16 బంతులాడి 10 పరుగులు చేసి నిరాశ పరిచాడు. కాగా.. చివరి వన్డేకు ముందు కామెంటేటర్ హర్షా భోగ్లే, పంత్‌తో చిన్న ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు అడిగిన భోగ్లే.. గతంలో వీరూ(వీరేందర్ సెహ్వాగ్) కూగా ఈ ప్రశ్న ఆడిగా అని చెబుతూ.. పంత్ ఆటను చూస్తే.. వైట్‌బాల్ క్రికెట్(టీ20, వన్డే)లో అద్భుతంగా రాణిస్తారు అని అనుకుంటారు. కానీ.. నువ్వు మాత్రం రెడ్ బాల్ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నావ్. అని అడగ్గా.. పంత్ బదులిస్తూ.. నేను వైట్ బాల్ క్రికెట్‌లోనూ బాగానే ఆడుతున్నాను. టీ20ల్లోనే కాస్త నా రికార్డు బాగాలేదు అని చెబుతుండగా.. మధ్యలో అడ్డుకున్న భోగ్లే.. నేను రికార్డ్స్ గురించి అడగటం లేదు.. కంప్యారిజన్ గురించి మాట్లాడుతున్నని చెప్పగా.. ఇప్పుడు నా వయసు కేవలం 24, 25.. ఇప్పుడే నన్ను అతనితో కంప్యార్ చేయవద్దు. నేను 30, 32 ఏళ్ల వయసుకొచ్చిన తర్వాత పోల్చండి.. అంటూ కాస్త అసహనంగా బదులిచ్చాడు. అంటే ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉంది. అని పంత్ భావిస్తూ.. పై విధంగా స్పందించాడు.
Rishabh Pant interview with Harsha Bhogle before 3rd ODI against NZ talking about rain, batting position, stats and scrutiny over T20i performance & WK drills. #NZvINDonPrime pic.twitter.com/TjOUdnPTCz
— S H I V A M 🇧🇷 (@shivammalik_) November 30, 2022