కొచ్చి వేదికగా ఐపీఎల్ 2023 సీజన్ కోసం నిన్న జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో ఫ్రాంచైజీలు కోట్ల వర్షం కురిపించాయి. ఇంగ్లండ్ ఆటగాళ్లు సామ్ కర్రన్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యారు. కొంతమందిపై కోట్లు కుమ్మరించిన ఫ్రాంచైజ్‌లు.. మరికొంతమందికి నిరాశ మిగిల్చాయి. ఈ వినీ వేలంలో 80 మంది ఆటగాళ్లు అమ్ముడుపోగా.. చాలా మంది ప్లేయర్లు అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు. సామ్ కర్రన్‌ను పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత భారీ ధర రూ.18.5 కోట్లు పెట్టి కొనుగోలు చేయగా.. బెన్ స్టోక్స్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.16.25 కోట్లు పెట్టి దక్కించుకుంది. అలాగే ఆసీస్ యువ క్రికెటర్ కామెరున్ గ్రీన్‌కు రూ.17.5 కోట్లకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. అలాగే విండీస్ బ్యాటర్ నికోలస్ పూరన్‌కు అసలు ఊహించని ధర దక్కింది. రూ.16 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ దక్కించుకుంది. హ్యారీ బ్రూక్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.13.25 కోట్లకు కొనుగోలు చేసింది.
అయితే.. ఈ మినీ వేలానికి పర్స్‌లో పెద్దగా డబ్బులేకుండా వేలం బరిలోకి దిగిన ఆర్సీబీ.. పక్కా ప్రణాళికతో మంచి బౌలర్లను పట్టింది. తమకున్న కొంత డబ్బుతోనే ఇద్దరు స్టార్ బౌలర్లను తక్కువ ధరకు దక్కించుకుంది. విల్ జాక్స్, రీస్ టాప్‌లే, రజన్ కుమార్, అవినాష్ సింగ్, హిమాన్షు శర్మ, మనోజ్ భండాగే, సోనూ యాదవ్‌లను మినీ వేలంలో కొనుగోలు చేసి ఆర్బీబీ… టోప్లీకి రూ.1.9 కోట్ల ధర చెల్లించింది. అలాగే ఇంగ్లండ్‌కు చెందిన బ్యాటర్ విల్ జాక్స్‌కు రూ.3.2 కోట్ల ధర పెట్టి కొనుగోలు చేసింది. వీరిద్దరూ చేరికతో ఆర్సీబీ మరింత బలపడింది. ఇప్పటికే డుప్టెసిస్, విరాట్ కోహ్లీ, మ్యాక్స్‌వెల్‌తో పటిష్టంగా ఉన్న ఆర్సీబీ.. జాక్ విల్స్ రాకతో దుర్భేద్యంగా తయారైంది. అయితే.. ప్లేయింగ్ ఎలెవన్‌లో విల్ జాక్స్‌కు చోటు కోసం కెప్టెన్ తలపట్టుకోక తప్పేలా లేదు.
డుప్టెసిస్‌తో కలిసి యువ క్రికెటర్ అనుజ్ రావత్ ఓపెనింగ్ చేసినా.. లేక విరాట్ కోహ్లీ ఓపెనింగ్‌కు దిగే అవకాశం ఉంది. రావత్ టీమ్‌లో ఉంటే.. లోమ్రోర్‌కు చోటు దక్కకపోవచ్చు. ఇక మిడిల్డార్‌లో రజత్ పటీదార్, మ్యాక్స్‌వెల్ ఉన్నారు. లోయర్ ఆర్డర్‌లో ది ఫినిషర్ దినేష్ కార్తీక్ ఉండనే ఉన్నాడు. శ్రీలంక ఆల్‌రౌండర్ వనిందూ హసరంగా స్పిన్ మ్యాజిక్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ దడదడలాడించగలడు. ఈ సారి ఆర్సీబీ బౌలింగ్ మాత్రం బలంగా ఉంది. మెహమ్మద్ సిరాజ్, హెజల్ వుడ్, టోప్లీతో పేస్ ఎటాక్ పటిష్టంగా ఉంది. స్పిన్ విభాగంలో హసరంగా, ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్‌తో పాటు మ్యాక్సీ కూడా బాల్‌ను తిప్పేయగలడు. మరి ఈ ఆర్సీబీ ప్లేయింగ్ ఎలెవన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ప్లేయింగ్ ఎవలెవన్(అంచనా)
ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, రజత్ పటీదార్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్, షాబాజ్ అహ్మద్, వనిందూ హసరంగా, మెహమ్మద్ సిరాజ్, జోష్ హెజల్‌వుడ్/టోప్లీ, హర్షల్ పటేల్. మిగిలిన ఆటగాళ్లు.. అనుజ్ రావత్, డేవిడ్ విల్లీ, మహీపాల్ లోమ్మెర్, ఫిన్ అలెన్, సిద్ధార్థ కౌల్, కర్ణ్ శర్మ, సుయాష్ ప్రభుదేశాయి, ఆకాశ్ దీప్, విల్ జాక్స్, రజన్ కుమార్, అవినాష్ సింగ్, హిమాన్షు శర్మ, మనోజ్ భండాగే, సోనూ యాదవ్.
— IndianPremierLeague (@IPL) December 24, 2022