టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసింది తప్పని సీనియర్ స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ సంచలన కామెంట్ చేశాడు. భారత్-శ్రీలంక మధ్య గౌహతీ వేదికగా జరిగిన తొలి వన్డేలో లంక కెప్టెన్ షనకను టీమిండియా బౌలర్ మొహమ్మద్ షమీ మన్కడింగ్ ద్వారా రనౌట్ చేస్తే.. దాన్ని రోహిత్ శర్మ వెనక్కి తీసుకోవడాన్ని తప్పుబట్టాడు. క్రికెట్‌లో మన్కడింగ్ చట్టబద్దమైందని అయినా.. దాన్ని ఒక అనైతిక అవుట్‌గా చూడటం మానేయాలని అన్నాడు. ఆటలో బ్యాటర్లు, బౌలర్లకు సమాన అవకాశాలు ఉండాలని.. బాల్ వేయకముందే. బ్యాటర్ క్రీజ్ వదిలి వెళితే అది కరెక్ట్ ఎలా అవుతుందని ప్రశ్నించాడు. అయినా.. మన్కడింగ్ విషయంలో వెనక్కి తీసుకున్నట్లే.. ఒక బ్యాటర్ 99పై ఆడుతున్న సమయంలో స్టంప్ అవుట్, ఎల్బీడబ్ల్యూ అయితే వెనక్కి తీసుకుంటారా అని ప్రశ్నించాడు.
అయినా మన్కడింగ్ విషయంలో ఏ టీమ్ కెప్టెన్ కూడా జోక్యం చేసుకోకూడదని.. అన్నాడు. శ్రీలంకతో మ్యాచ్‌లో షమీ చేసిన మన్కడింగ్‌ను రోహిత్ శర్మ వెనక్కి తీసుకోవడంపైనే తాను మాట్లాడటం లేదని.. ఓవరాల్‌గా క్రికెట్‌లో మన్కడింగ్‌ను అనైతికం అనడం సరికాదన్నాడు. మన్కడింగ్ ద్వారా రనౌట్ చేయడం ఇప్పుడు చట్టబద్ధమైందే. ఒకవేళ ఎల్బీ, క్యాచ్ ఔట్ సమయంలో కెప్టెన్ నిర్ణయంతో చెక్ చేస్తారా? చేయరు. బౌలర్ అపీలు చేస్తే అది ఔట్ అయితే అంపైర్ దానిని అవుట్‌గా ప్రకటిస్తారు. లేకపోతే లేదు. అంతేకానీ.. బౌలర్ అపీల్ చేసిన తర్వాత అది రూల్స్ ప్రకారం అవుటైనా.. కెప్టెన్ నిర్ణయంతో అంపైర్ నిర్ణయం ప్రకటించకపోవడం కరెక్ట్‌కాదన్నాడు.
కాగా.. మూడో వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో ఈ సంఘటన చోటు చేసుకుంది. టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసిన 373 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ స్కోర్ ఛేదించే క్రమంలో మిగహా బ్యాటర్లు విఫలమైనా.. లంక కెప్టెన్ షనక మాత్రం సెంచరీతో రాణించాడు. అయితే.. అతను 98 పరుగుల వద్ద ఉన్న సమయంలో ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో షమీ అతన్ని మన్కడింగ్ ద్వారా రనౌట్ చేసి అపీల్ చేస్తాడు. కానీ.. కెప్టెన్ రోహిత్ శర్మ.. షమీ వద్దకు వెళ్లి అపీల్‌ను వెనక్కి తీసుకోమని కోరడంతో.. షమీ తన అపీల్‌ను వెనక్కి తీసుకోవడంతో.. షనక అవుట్ నుంచి బతికిపోయి.. చివరి బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే.. 98 పరుగులతో వీరోచిత పోరాటం చేసిన షనకాను ఆ పద్ధతిలో అవుట్ చేయడం సరికాదని అపీల్‌ను వెనక్కి తీసుకున్నట్లు రోహిత్ వెల్లడించాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Shami run-out Shanaka in the non-striker end then Rohit & Shami decided to withdraw the appeal. pic.twitter.com/Zbza30HvFW
— Johns. (@CricCrazyJohns) January 10, 2023