బంగ్లాదేశ్ తో జరిగిన రెండో టెస్ట్ లో టీమిండియా చావు తప్పి కన్ను లొట్టపోయిన చందనంగా గెలిచింది. కేవలం 145 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 74 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. బంగ్లా బౌలర్ల ధాటికి టీమిండియా ఓటమి ఖాయం అనుకున్నారు అంతా కానీ అప్పుడే క్రీజ్ లోకి అడుగు పెట్టాడు ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్. తనదైన బ్యాటింగ్ తో శ్రేయస్ అయ్యర్ తో కలిసి బంగ్లా బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. 62 బంతులు ఎదుర్కొన్న అశ్విన్ 4 ఫోర్లు ఓ సిక్స్ తో 42 పరుగులతో నాటౌట్ గా నిలిచి భారత్ కు అపురూపమైన విజయాన్ని కట్టబెట్టాడు. ఇక ఈ మ్యాచ్ లో అశ్విన్ 34 సంవత్సరాల.. వెస్టిండీస్ దిగ్గజం రికార్డును బద్దలు కొట్టాడు.
బంగ్లాదేశ్ తో రెండో టెస్ట్.. టీమిండియా బౌలర్లు అద్భుతంగా రాణించడంతో 145 పరుగుల స్వల్ప లక్ష్యం భారత్ ముందు ఉంది. ఇంకేముంది టీమిండియా విజయం ఖాయం అనుకున్నారు అంతా. కానీ బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో టీమిండియా టాపార్డర్, మిడిలార్డర్ పేకమేడలా కుప్పకూలింది. మెహదీ హసన్ 5 వికెట్లతో మాయాజాలం చెయ్యడంతో.. 74 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలుచుంది టీమిండియా. ఈ క్రమంలోనే క్రిజ్ లోకి అడుగుపెట్టాడు రవిచంద్రన్ అశ్విన్. అయ్యర్ తో కలిసి బంగ్లా బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. 62 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్ తో 42 పరుగులతో నాటౌట్ గా నిలిచి భారత్ కు అద్భుతమైన విజయాన్ని అందించాడు.
ఈ క్రమంలోనే అశ్విన్ ఓ అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. టెస్ట్ క్రికెట్ లో విజయవంతమైన ఛేజింగ్ లో తొమ్మిది లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు విన్ట్సన్ బెంజమిన్ పేరిట ఉన్న 40 పరుగుల రికార్డ్ ను అశ్విన్ బద్దలు కొట్టాడు. 1988లో పాక్ తో జరిగిన మ్యాచ్ లో బెంజమిన్ 40 రన్స్ తో నాటౌట్ గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. తాజాగా ఈ రికార్డ్ ను బద్దలు కొట్టాడు అశ్విన్. ఇక అశ్విన్ కు అండగా నిలిచిన అయ్యర్ 4 ఫోర్లతో 29 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. కీలక ఇన్నింగ్స్ తో భారత విజయంలో ముఖ్య పాత్ర పోషించిన అశ్విన్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అభించింది.
Ravichandran Ashwin 42* is highest by No 9 or lower order during successful run chase in Test Cricket.
34 years old test record is broken today!.
— Cric Analyst (@analyst_cric) December 25, 2022
#INDvsBAN Test: #RavichandranAshwin shatters 34-year-old record in Tests! @ashwinravi99 https://t.co/0nIIg2yOSi
— Zee News English (@ZeeNewsEnglish) December 26, 2022