నాలుగో టెస్టు డ్రాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ముగిసింది. 2-1తో భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. చివరి టెస్టులో సెంచరీతో దుమ్మురేపిన కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్దు దక్కగా.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు మాత్రం ఇద్దరికి ఇచ్చారు..
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023 ముగిసింది. అహ్మాదాబాద్ వేదికగా జరిగిన చివరి టెస్టు డ్రాగా ముగియడంతో 2-1తో టీమిండియా వరుసగా నాలుగోసారి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంది. నాగ్‌పూర్, ఢిల్లీ వేదికల్లో జరిగిన తొలి రెండు టెస్టులను టీమిండియా గెలిచిన విషయం తెలిసిందే. ఇండోర్‌లో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఇక నాలుగో టెస్టులో గెలిచి.. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలని భావించినా టీమిండియా.. మ్యాచ్ గెలవకుండానే డబ్ల్యూటీసీ ఫైనల్ చేరింది. న్యూజిలాండ్ చేతిలో శ్రీలంక తొలి టెస్టులో ఓడిపోవడంతో భారత్‌కు మ్యాచ్ గెలవాల్సిన అవసరం లేకుండా పోయింది. దీంతో ఆస్ట్రేలియాపై సిరీస్ విజయంతో పాటు, ఇదే ఆస్ట్రేలియాపై ఈ ఏడాది జూన్ 7 నుంచి 11 వరకు జరగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడేందుకు భారత్ అర్హత సాధించింది.
తొలి మూడు టెస్టులు మూడు రోజుల్లోనే ముగియగా.. నాలుగో టెస్టు మాత్రం ఐదు రోజులు సాగింది. కానీ.. ఫలితం తేలలేదు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 480 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌట్ అయింది. ఉస్మాన్ ఖవాజా 180, కామెరున్ గ్రీన్ 114 పరుగులు చేసి రాణించారు. ఆసీస్ ఆలౌట్ తర్వాత తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా సైతం గట్టిగానే బదులిచ్చింది. టీమిండియా స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(186) తోపాటు యువ క్రికెటర్ శుబ్‌మన్ గిల్(128) సెంచరీలతో చెలరేగడంతో భారత్ సైతం తొలి ఇన్నింగ్స్‌లో 571 పరుగుల భారీ స్కోర్ చేసింది. దీంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగుస్తుందనే విషయం అర్థమైంది.
కానీ.. చివరి రోజు భారత బౌలర్లు ఏదైన అద్భుతం చేయకపోతారా? అనే నమ్మకం కొత్త మంది క్రికెట్ అభిమానుల్లో ఉన్నా.. అది ఫలించలేదు. రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియాను అశ్విన్ ఆరంభంలోనే దెబ్బతీయడంతో ఆశలు చిగురించినా.. తర్వాత ట్రావిస్ హెడ్ లబుషేన్ ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను డ్రా చేసుకునేందుకు ఆడారు. చివరికి 78.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 175 పరుగుల వద్ద ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి.. మ్యాచ్‌ను ముగించింది. దీంతో.. 2-1 తేడాతో భారత్.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో 186 రన్స్‌తో అదరగొట్టిన విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అలాగే సిరీస్ ఆసాంతం తమ స్పిన్ బౌలింగ్‌తో ఆకట్టుకున్న అశ్విన్-జడేజా జంటకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును ప్రకటించారు. అశ్విన్-జడేజా సంయుక్తంగా ఆ అవార్డును అందుకున్నారు. ఇక ఈ నెల 17 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ ఆరంభం కానుంది. ఈ నాలుగో టెస్టులో భారత జట్టు ప్రదర్శన, జడేజా-అశ్విన్‌కు కలిపి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
The Greatest spin duo in Test history – Jadeja & Ashwin. pic.twitter.com/Hndda5Zgzh
— Johns. (@CricCrazyJohns) March 13, 2023
Captain Rohit Sharma lifts the Border Gavaskar Trophy. pic.twitter.com/zLASPyS0VG
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 13, 2023