అఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే కనీస సదుపాయాలు లేని స్థితి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ, ఇప్పుడు ప్రముఖ జట్లని ఓడించే స్థాయికి చేరుకుంది. ఒకవేళ ఓడించకపోతే, గట్టిపోటీ ఇస్తోంది. ఆ జట్టులోని పలువురు ఆటగాళ్లు.. అద్భుత ప్రదర్శనతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఐపీఎల్, బీబీఎల్ లాంటి లీగ్స్ లోనూ ఆడుతూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇకపోతే ఈ జట్టులోని ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆసియాకప్ లో ఆడుతున్న రషీద్.. భారత్ మ్యాచ్ కి ముందే షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. దుబాయిలో జరుగుతున్న ఆసియాకప్ లో అఫ్ఘనిస్థాన్ అద్భుత ప్రదర్శన చేస్తోంది. శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లపై గెలిచి, సూపర్ 4కి అర్హత సాధించింది. ఇప్పుడు సూపర్ 4లో వరసగా శ్రీలంక, పాకిస్థాన్, భారత్ తో మ్యాచులు ఆడనుంది. ఈ క్రమంలోనే అఫ్ఘన్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘మాకు ఏ జట్టుతో మ్యాచుకైనా రెడీ… అది ఇండియా, పాకిస్థాన్ ఏదైనా సరే. ప్రత్యర్థి ఎవరైనా సరే మా ఫోకస్ మారదు, ఆటలో తీవ్రత అస్సలు తగ్గదు’ అని రషీద్ అన్నాడు. దీన్నిబట్టి చూస్తుంటే.. భారత్ జట్టుకి భయపడేది లేదని పరోక్షంగా అన్నట్లు అనిపిస్తోంది.
ఇదిలా ఉండగా ఆసియాకప్ లో ప్రస్తుతం సూపర్ 4 దశకు భారత్,పాకిస్థాన్, శ్రీలంక, అప్ఘనిస్థాన్ అర్హత సాధించింది. బంగ్లాదేశ్, హాంకాంగ్ టోర్నీ నుంచి వైదొలిగాయి. ఈ టోర్నీలో భారత్ ఏడుసార్లు కప్పు గెలుచుకోగా, శ్రీలంక ఐదుసార్లు విజేతగా నిలిచింది. అప్ఘనిస్థాన్ ఈ టోర్నీలో మూడోసారి ఆడుతోంది. ఒకవేళ ఈసారి భారత్ తో మ్యాచ్ లో అఫ్ఘన్ జట్టు ఏమైనా అద్భుతాలు చేస్తుందేమో చూడాలి. మరి రషీద్ వ్యాఖ్యల గురించి మీరేం అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇది కూడా చదవండి: బంగ్లాదేశ్‌నూ చిత్తు చేసిన అఫ్ఘనిస్థాన్! రషీద్ ఖాన్ ఖాతాలో అరుదైన రికార్డు