టీ20 క్రికెట్‌లోనే అత్యుత్తమ బౌలర్లు ఆ జట్టులో ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురున్నారు. అలాగే ప్రస్తుత టీ20 క్రికెట్‌లో అద్భుతంగా ఆడుతున్న ఓపెనర్లు, ఫినిషర్ ఉన్న టీమ్. అఫ్ఘనిస్థాన్ పేరుకు చిన్నటీమే అయినా.. జట్టులో మ్యాచ్ విన్నర్లకు కోదవలేదు. తొలి మ్యాచ్‌లో శ్రీలంకను చిత్తుచిత్తుగా ఓడించి.. రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడింది. తొలుత బౌలింగ్ బలంతో ప్రత్యర్థి బంగ్లాదేశ్‌ను దెబ్బకొట్టి.. తర్వాత తమ పవర్ హిట్టింగ్‌ను రుచిచూపించి ఆసియా కప్‌లో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది అఫ్ఘనిస్థాన్. ఆ జట్టు టాప్ క్లాస్ బౌలర్లు రషీద్‌ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ మూడేసి వికెట్లతో బంగ్లాను ముప్పుతిప్పలు పెట్టారు. వీరి బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు బంగ్లా బ్యాటర్లు వణికిపోయారు. అనంతరం లక్ష్యఛేదనలో ఆఫ్ఘాన్ బ్యాటర్ నజీబుల్లా జద్రాన్ చెలరేగిపోయాడు. ఆరు భారీ సిక్సులు మ్యాచ్‌ను మలుపుతిప్పి అఫ్ఘానిస్థాన్ చేతుల్లో పెట్టాడు. మ్యాచ్ పూర్తి వివరాల్లోకి వెళ్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 127 పరుగులు మాత్రమే చేసింది. లోయరార్డర్ బ్యాటర్ మోసాద్దేక్ హోస్సెన్ 31 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 48(నాటౌట్) పరుగులతో రాణించడంతో ఆ జట్టు గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. హోస్సెన్‌కు సపోర్ట్‌గా మాజీ కెప్టెన్ మహముదుల్లా(25) పర్వాలేదనిపించగా.. మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అఫ్ఘనిస్థాన్ స్పిన్ ద్వయం ముజీబ్ ఉర్ రెహ్మాన్, రషీద్ ఖాన్ మూడేసి వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించారు. లక్ష్య చేధరకు దిగిన అఫ్ఘానిస్థాన్.. తొలుత తడబడినా.. చివరికి నిలబడింది. జద్రాన్ పోరాటంతో 18.3 ఓవర్లలోనే 3 వికెట్లకు 131 పరుగులు చేసి రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. బంగ్లా స్పిన్నర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఓ దశలో అఫ్ఘానిస్థాన్ ఓడిపోతుందేమో అనిపించింది. కానీ.. 24 బంతుల్లో 43 పరుగులు అవసరమైన టైమ్‌లో నజీబుల్లా జద్రాన్ చెలరేగిపోయాడు. ముస్తాఫిజుర్ వేసిన 17 ఓవర్‌లో రెండు భారీ సిక్సర్లతో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. సైఫుద్దిన్ వేసిన 18వ ఓవర్‌లో ఇబ్రహీమ్ రెండు బౌండరీలు బాదగా నజీబుల్లా రెండు భారీ సిక్సర్లతో విజయం ఖాయం చేశాడు. 19వ ఓవర్‌లో మరో భారీ సిక్సర్ బాది విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. కేవలం 17 బంతులు ఎదుర్కొన్న నజీబుల్లా ఒక ఫోర్, 6 సిక్సులతో 43 పరుగులు చేసి విజయాన్ని అందించాడు. రషీద్ ఖాన్ ఖాతాలో అరుదైన రికార్డు.. టీ20 స్పెషలిస్ట్ వరల్డ్ క్లాస్ బౌలర్ రషీద్ ఖాన్ టీ20 క్రికెట్‌లో అరుదైన రికార్డు సాధించాడు. అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. టీ20ల్లో రషీద్ ఖాన్ 115 వికెట్లు పడగొట్టాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఖాన్ 4 ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 22 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీయడం ద్వారా 114 వికెట్లు తీసిన న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సౌథీని రషీద్ అధిగమించాడు. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ 122 వికెట్లతో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. మరి బంగ్లాదేశ్‌పై అఫ్ఘనిస్థాన్ విజయం, రషీద్ ఖాన్ రికార్డు, నజీబుల్లా పవర్‌హిట్టింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్లరూపంలో తెలియజేయండి. What a knock from Najibullah Zadran! #NajibullahZadran #AFGvBAN #AsiaCup pic.twitter.com/7trr6LPbdv — CricTracker (@Cricketracker) August 30, 2022 A spectacular finish from Najibullah Zadran as Afghanistan make it two wins in two in #AsiaCup2022 #BANvAFG | Scorecard: https://t.co/5cGrYOhU7p pic.twitter.com/NKPYC2Xp9q — ICC (@ICC) August 30, 2022 Here's how Asia Cup 2022 points table looks like after the Bangladesh vs Afghanistan match.#CricTracker #BANvAFG #AsiaCup2022 #NajibullahZadran pic.twitter.com/evDGldPTPK — CricTracker (@Cricketracker) August 30, 2022 Unbelievable fight and an even better win! Super happy to contribute tonight, we keep going on!! #BANvAFG #AsiaCup2022 #AsiaCup pic.twitter.com/IjxgtPsrGB — Rashid Khan (@rashidkhan_19) August 31, 2022 Rashid Khan is in a different league in the T20 format. pic.twitter.com/KDXArhvdDo — Johns. (@CricCrazyJohns) August 30, 2022 Rashid Khan now second leading wickettaker in T20I Internationals in just 68 matches - He is a Freak. pic.twitter.com/XMymVDhaJV — CricketMAN2 (@ImTanujSingh) August 30, 2022