ఐపీఎల్ పుణ్యమా అంటూ చాలామంది యువ క్రికెటర్లు వెలుగులోకి వస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది ప్లేయర్లు తమ టాలెంట్ నిరూపించుకొని టీంఇండిలోకి ఎంట్రీ ఇచ్చిన వారు కూడా ఉన్నారు. అలాంటి లిస్టులోకి ఐపీఎల్ స్టార్ రింకు సింగ్ చేరిపోతున్నాడని తెలుస్తుంది.
అఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే కనీస సదుపాయాలు లేని స్థితి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ, ఇప్పుడు ప్రముఖ జట్లని ఓడించే స్థాయికి చేరుకుంది. ఒకవేళ ఓడించకపోతే, గట్టిపోటీ ఇస్తోంది. ఆ జట్టులోని పలువురు ఆటగాళ్లు.. అద్భుత ప్రదర్శనతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఐపీఎల్, బీబీఎల్ లాంటి లీగ్స్ లోనూ ఆడుతూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇకపోతే ఈ జట్టులోని ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. […]