పాకిస్థాన్ క్రికెట్ జట్టు.. ఎప్పుడు ఎలా ఆడుతుందో అంచనాల వేయలేని ఒక విచిత్రమైన జట్టు. తరాలు మారినా, ఆటగాళ్లు మారినా.. వారికి మాత్రమే సొంతమైన నిలకడలేమి ఆట మాత్రం మారడంలేదు. పాక్ జట్ట ఏ రోజు ఛాంపియన్ టీమ్‌లా ప్రదర్శన ఇస్తుందో.. ఏ రోజు పసికూన కంటే దారుణంగా ఆడుతుందో.. పెద్ద పెద్ద క్రికెట్ పండితులకు సైతం అంతుచిక్కని విషయం. అలాంటి పాకిస్థాన్ తాజాగా ప్రపంచ క్రికెట్‌లో చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును క్రియేట్ చేసింది. దాదాపు 145 ఏళ్లు పైబడిన క్రికెట్ చరిత్రలో.. ఎప్పుడూ జరగని సంఘటన ఒకటి.. పాకిస్థాన్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో చోటు చేసుకుంది. పాకిస్థాన్‌తో రెండు టెస్టులు, మూడు వన్డేలు ఆడేందుకు పాక్ గడ్డపై అడుగుపెట్టింది న్యూజిలాండ్.
ఈ రెండు జట్ల మధ్య సోమవారం.. కరాచీ వేదికగా తొలి టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ బాబర్ అజమ్.. తొలుత బ్యాటింగ్ చేసేందుకు నిర్ణయించాడు. ఈ సిరీస్ కంటే ముందే.. ఇంగ్లండ్ చేతుల్లో వైట్‌వాష్‌కు గురై.. తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న పాక్ టీమ్‌ను.. న్యూజిలాండ్ వికెట్ కీపర్ టామ్ బ్లండెల్ చావు దెబ్బ కొట్టాడు. మ్యాచ్ మొదలైన కొన్ని నిమిషాల్లోనే ఇద్దరు ఆటగాళ్లను స్టంప్ అవుట్ చేసి.. క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘనతను సాధించాడు. టెస్టు క్రికెట్‌లో ఏ టీమ్ కూడా తొలి రెండు వికెట్లను స్టంప్ అవుట్ రూపంలో కోల్పోయిన దాఖలా లేదు. ఆ చెత్త రికార్డును పాకిస్థాన్ తమ ఖాతాలోనే వేసుకుంది. అలాగే టెస్టు మ్యాచ్‌లో తొలి రెండు వికెట్లను స్టంప్ రూపంలో పెవిలియన్ చేర్చిన అరుదైన ఘనతను న్యూజిలాండ్ సొంతం చేసుకుంది.
ఈ అరుదైన ఫీట్ క్రెడిట్ కచ్చితంగా న్యూజిలాండ్ వికెట్ కీపర్ టామ్ బ్లండెల్‌కే ఇవ్వాలి. పాక్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్, వన్ డౌన్ బ్యాటర్ షాన్ మసూద్‌ను స్టంప్ అవుట్ చేసి.. అరుదైన రికార్డు సాధించాడు. అయితే ఈ మ్యాచ్‌లో పాక్ 48 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయినా.. పాక్ కెప్టెన్ బాబర్ అజమ్(161) సెంచరీతో పాటు సీనియర్ ప్లేయర్, మాజీ కెప్టెన్ సర్ఫారాజ్ అహ్మద్(86) పరుగులతో రాణించడంతో పాకిస్థాన్ మంచి స్కోర్‌వైపే దూసుకెళ్తుంది. తొలి ఆట ముగిసే సమయానికి 161 రన్స్‌తో నాటౌట్‌గా ఉన్న బాబర్.. రెండో రోజు తొలి ఓవర్‌లోనే అవుట్ అయ్యాడు. ప్రస్తుతం పాకిస్థాన్ 6 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసి.. తొలి ఇన్నింగ్స్ కొనసాగిస్తోంది. మరి ఈ మ్యాచ్‌లో పాక్ పేరిట నమోదైన అత్యంత చెత్త రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
RECORD ALERT: 🚨 For the first time in 145 years of men’s Test cricket, the first two wickets in a match were both stumped!
Abdullah Shafique stumped by Tom Blundell❌
Shan Masood stumped by Tom Blundell❌#PAKvsNZ #NZvsPAK #Cricket #CricketTwitter pic.twitter.com/Krv8kDIqmV— Vtrakit Cricket (@Vtrakit) December 26, 2022