ప్రస్తుతం క్రికెట్ జాతర జరుగుతున్న విషయం తెలిసిందే. అటు ఆసియా కప్పు, ఇటు ఐసీసీ టీ20 ప్రపంచకప్పు ఉన్న నేపథ్యంలో అన్ని దేశాల జట్లు కఠోర శ్రమ చేస్తున్నాయి. బీసీసీఐ సైతం రెండు మెగా టోర్నమెంట్లకు అత్యుత్తమ జట్టును తయారు చేసే పనిలో మునిగిపోయింది. రాహుల్ ద్రవిడ్ అయితే రెండు జట్లుగా విడగొట్టి మరీ ప్లేయర్లను పరీక్షిస్తున్నాడు. విరామం లేకుండా టూర్లు, సిరీస్‌లు అంటూ టీమిండియా సమాయత్తమవుతోంది.
అయితే దాయాది దేశంలో పరిస్థితి మాత్రం ఇంకోలా ఉంది. ఆ దేశంలోని క్రికెట్ ఫ్యాన్సే వాళ్ల బోర్డుపై పెదవి విరుస్తున్నారు. బాహాటంగానే సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. ఆసియా కప్పు, టీ20 ప్రపంచకప్పు ఉన్న నేపథ్యంలోనూ వారిలో సీరియస్‌నెస్ కనిపించడం లేదంటూ గగ్గోలు పెడుతున్నారు. అసలు బోర్డు తీరేంటో తమకు అంతుపట్టడం లేదు అంటున్నారు.
Mohammad Hasnain replaces injured Shaheen Afridi in Pakistan’s Asia Cup squad 🏏 pic.twitter.com/RDyZgk5nbN
— ESPNcricinfo (@ESPNcricinfo) August 22, 2022
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీరుపై కూడా గట్టిగానే కౌంటర్లు వస్తున్నాయి. సంవత్సరం నుంచి మీరు ఏం చేస్తున్నారు? ఎందుకు ఎప్పుడూ ఒకే జట్టుతో వెళ్తున్నారు? ప్రయోగాలు లాంటివి చేయరా? బాబర్ అజామ్ ఒక్కడు ఉంటే సరిపోతుందా? అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలా అయితే ప్రపంచ కప్పు సంగతి పక్కన పెడితే ఆసియా కప్పులో నైనా టీమిండియాని ఓడిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
BREAKING NEWS — Mohammad Hasnain has been named as replacement of Shaheen Shah Afridi in AsiaCup 2022. Mir Hamza and Hassan Ali ignored.
— Arfa Feroz Zake (@ArfaSays_) August 22, 2022
షాహీన్ అఫ్రీది ఆసియా కప్పు నుంచి తప్పుకోవడంతో వారి అసహనం మరింత పెరిగింది. షాహీన్ అఫ్రీది స్థానంలో మహ్మద్ హస్‌నైన్ ను ఎంపిక చేయడంపై కూడా తిట్టిపోస్తున్నారు. 2021 డిసెంబర్ నుంచి ఒక్క టీ20 కూడా ఆడని ఆటగాడిని ఎలా సెలక్ట్ చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. అసలు గెలవాలి, కప్పు కొట్టాలనే ఆలోయన టీమ్లో గానీ, బోర్డులో గానీ కనిపించడం లేదంటున్నారు. పాక్ బోర్డుపై అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
PCB should replace Shaheen Afridi with M.Amir , although PAK have talent + pacers but All the boys are inexperienced & PAK fans Want M.Amir in Asia Cup ,Sometime you should go through with fans choice it can be batter then your decision.
— M. Hammad (@madiiboy01) August 22, 2022