లెజెండ్ బాక్సర్ కు నిరాశ తప్పలేదు. టోక్యో ఒలింపిక్స్ లో భారత అథ్లెట్లు విజయాల పరంపరను కొనసాగించారు. పతకాల వేటలో వడివడిగా దూసుకొని పోతున్నారు. గత కొన్ని రోజులుగా నిరాశపరుస్తున్న అథ్లెట్లు ఈ రోజు విజయాలతో అభిమానులను అలరించారు. దీంతో ఫ్యాన్స్ సంతోషంలో మునిగి తేలారు. అయితే మేరి కోమ్ ఓటమితో ఫ్యాన్స్ ఆశలు ఆడియాసలు అయ్యాయి. ఇండియన్ స్టార్ బాక్సర్ ఆరుసార్లు వరల్డ్ చాంపియన్ మేరీ కోమ్ ఒలింపిక్స్ గోల్డ్ కల చేజారడంతో ఆమె ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశ చెందారు.
ఒకప్పుడు బాక్సింగ్ కేవలం పురుషులకే పరిమితమై ఉండేది. కాలం మారేకొద్దీ ఈ రంగంలో కూడా మహిళల ప్రవేశించడం మాత్రమే కాదు ఆ రంగంలో తమ సత్తాను చాటుకుంటున్నారు. బంగారు పతకాలతో దేశప్రతిష్టను పెంచుతున్నారు. ఈ లిస్ట్ లో మొదట మనకు గుర్తొచ్చేది మేరీ కోమ్. ఈ మణిపూర్ మణిపూస 39 వ ఏటలోకి అడుగుపెట్టింది.
మేరీకోమ్ స్కూల్ జీవితంలోనే అథ్లెటిక్స్, బాక్సింగ్ నేర్చుకుంది. 21 సంవత్సరాల వయసులో మేరీకోమ్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనేం దుకు ప్రయత్నించారు. 2008లో ఆసియాక్రీడలో ఉమెన్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌ను పొందారు. 2009లో వియత్నాంలో జరిగిన ఆసియాక్రీడలో బంగారుపతకాన్ని సాధించారు. అలాగే 2010లో కిజికిస్థాన్‌లో జరిగిన ఆసియా మహిళా బాక్సింగ్‌లో చాంపియన్‌షిప్‌ను పొందారు.
మేరీ కోమ్ ముగ్గురుపిల్లల తల్లి, రాజకీయ వేత్త. అయితేనేం తనకు వయసు, పిల్లలు, కుటుంబ బాధ్యతలు ఇవేవీ అడ్డురాలేదు. రౌండ్ 16 పోరులో కొలంబియన్ బాక్సర్ వాల్నసీయా విక్టోరియా చేతిలో మేరి కోమ్ ఓటమి పాలైంది. 3-2 తేడాతో మేరీ కోమ్ ఓటమి పాలైంది. జడ్జీలు కొలంబియన్ బాక్సర్ వైపే మొగ్గు చూపడంతో భారత్ కు నిరాశ తప్పలేదు.
తొలి రౌండ్లోనే విక్టోరియా ఎదురుదాడికి దిగడంతో మేరీ కోమ్ కు కోలుకునే అవకాశం దక్కలేదు. లండన్ బలింపిక్స్ లో కాంస్య పతకం నెగ్గిన మేరీ కోమ్ – ఈ ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించాలని ఉవ్విల్లూరింది. కానీ, లెజెండ్ బాక్సర్ కు నిరాశ తప్పలేదు. వయస్సు ప్రకారం చూస్తే మేరి కోమ్ కు కచ్చితంగా ఇది చివరి ఒలింపిక్స్.
Bittersweet. What an absolute sport Mary Kom
pic.twitter.com/SeG1tLrUwU— • (@Shrutika_45_) July 29, 2021