సాధారణంగా ఫుట్ బాల్ లో గానీ, క్రికెట్ లో గానీ మ్యాచ్ లకు ముందు ఆటగాళ్లు ప్రాక్టీస్ చేయడం సర్వసాధారణం. అయితే ఈ క్రమంలో ప్లేయర్స్ గాయపడటం సహజమే అయినప్పటికీ.. కొన్ని కొన్ని సందర్భాల్లో అవి ప్రాణాలమీదకు సైతం వస్తాయి. తాజాగ అలాంటి సంఘటనే క్రీడాలోకంలో చోటుచేసుకుంది. ట్రైనింగ్ షెషన్ జరుగుతున్న క్రమంలో ఓ యువ ఆటగాడు ఉన్నట్లుండి గ్రౌండ్ లోనే కుప్పకూలిపోయాడు. దాంతో సహచర ఆటగాళ్లు హుటాహుటిన హెల్త్ సెంటర్ కు తరలించారు. అతడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే అతడు చికిత్స పొందుతూ మంగళవారం గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు తెలిపారు. యువ ఆటగాడి మరణంతో ఒక్కసారిగా క్రీడాలోకం మెుత్తం దిగ్భ్రాంతి చెందింది.
అండ్రెస్ బలంతా 22 ఏళ్ల యువ ఫుట్ బాల్ ఆటగాడు.. ప్రస్తుతం కొలంబియా ఫుట్ బాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తాజాగా అట్లెటికో టుకుమన్ ట్రెయినింగ్ సెషన్ లో అండ్రెస్ పాల్గొన్నాడు. ఈ ట్రైనింగ్ సెషన్ జరుగుతుండాగానే బలంతా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దాంతో నిర్వాహకులు భయపడి హుటాహుటినా టుకుమన్ హెల్త్ సెంటర్ కు తరలించారు. అతడికి చికిత్స అందిస్తున్న క్రమంలో మంగళవారం గుండెపోటు రావడంతో అండ్రెస్ బలంతా మరణించినట్లు వైద్యులు తెలిపారు. దాంతో కొలంబియా ఫుట్ బాల్ జట్టులో విషాదం నెలకొంది.
ఇక కొలంబియా జట్టుకు మిడ్ ఫీల్డర్ గా అండ్రెస్ బలంతా సేవలు అందిస్తున్నాడు. ఎంత ప్రత్నించినప్పటికీ అండ్రెస్ ను కాపాడలేకపోయామని వైద్యులు తెలిపారు. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజాలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మాంచెస్టర్ సిటీ దిగ్గజం సెర్జియో అగురో.. అండ్రెస్ మరణ వార్త తెలుసుకుని కన్నీటి పర్యంతం అయ్యాడు. ఇక ప్రస్తుతం ఖతర వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ లో కొలంబియా అర్హత సాధించడంలో విఫలం అయ్యింది. ఈ క్రమంలనే 2014లో క్వర్టర్ ఫైనల్స్ కు, 2018లో రౌండ్ ఆఫ్ 16లో వెనుదిరిగింది కొలంబియా. అండ్రెస్ మృతి కొలంబియా జట్టుకు తీరని లోటని ఆ జట్టు ఆటగాళ్లు లుయిస్ డియాజ్, జేమ్స్ రోడ్రిగ్వేజ్ లు సంతాపం వ్యక్తం చేశారు.
LUTO NO FUTEBOL! 😭💔 Morreu ontem Andrés Balanta, volante colombiano do Atlético Tucumán, durante um treino. Ele tinha apenas 22 anos e teve um mal súbito. Desejamos MUITA FORÇA à família e aos amigos! pic.twitter.com/5atCvgErxY
— TNT Sports BR (@TNTSportsBR) November 30, 2022