భారత తరఫున బాక్సింగ్ లో తనదైన మార్క్ చూపించి, పేరు తెచ్చుకున్న కౌర్ సింగ్ కన్నుమూశారు. దీంతో పలువురు ప్రముఖ ఆటగాళ్లు సంతాపం తెలియజేస్తున్నారు.
ప్రస్తుతం గురించి పక్కనబెడితే గతంలో మనకి అద్భుత బాక్సర్లు ఉండేవారు. అలాంటి వారిలో కౌర్ సింగ్ ఒకరు. హరియాణాకి చెందిన ఈయన.. పలు అనారోగ్య సమస్యలతో తాజాగా తుదిశ్వాస విడిచారు. గత కొన్నిరోజుల నుంచి హరియాణాలోని కురుక్షేత్ర ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. కానీ పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. ఈ క్రమంలోనే పలువురు క్రీడాకారులు ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి, ఆయనని మరోసారి గుర్తుచేసుకుంటున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్ లోని ఖనాల్ ఖుర్ద్ లో పుట్టిన కౌర్ సింగ్ కు ప్రస్తుతం ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. 1980లో ఎగ్జిబిషన్ మ్యాచ్ లో దిగ్గజ బాక్సర్ అయిన ముహమ్మద్ అలీతో మ్యాచ్ ఆడారు. 1982లో దిల్లీలో జరిగిన ఆసియా క్రీడల్లో హెవీ వెయిట్ బాక్సింగ్ లో గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు. ఈ క్రమంలోనే కౌర్ సింగ్ కు 1982లో అర్జున అవార్డు, 1983లో పద్మశ్రీ అవార్డులని ఇచ్చి భారత ప్రభుత్వం గౌరవించింది. ఆయన లైఫ్ ని పంజాబ్ లోని 9,10వ తరగతుల ఫిజికల్ ఎడ్యుకేషన్ బుక్స్ లో ఈ నెల ప్రారంభంలోనే చేర్చారు. అలాంటి ఆయన ఇప్పుడు అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడవడం చాలామందికి బాధ కలిగింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. ఆ విషయాన్ని వీలైతే కింద కామెంట్ చేయండి.
𝐈𝐧𝐝𝐢𝐚𝐧 𝐁𝐨𝐱𝐞𝐫 𝐰𝐡𝐨 𝐟𝐨𝐮𝐠𝐡𝐭 𝐰𝐢𝐭𝐡 𝐌𝐨𝐡𝐚𝐦𝐦𝐚𝐝 𝐀𝐥𝐢 .
Padamashri Indian Boxer #Legend 𝐒𝐮𝐛𝐞𝐝𝐚𝐫 𝐊𝐚𝐮𝐫 𝐒𝐢𝐧𝐠𝐡 𝐢𝐬 𝐧𝐨 𝐦𝐨𝐫𝐞. #KaurSingh #Rip #𝐒𝐢𝐤𝐡 #𝐏𝐮𝐧𝐣𝐚𝐛 pic.twitter.com/WD7bFEX0sr— ɢᴜʀᴘʀᴇᴇᴛ sɪɴɢʜ ᴍᴀᴀɴ (@iamgurpreetmaan) April 27, 2023