ప్రపంచ టెన్నిస్ లో తనకంటూ ఓ పేరును లిఖించుకున్న సెర్బియన్ స్టార్ నోవాక్ జకోవిచ్ మరో మైలురాయిని అధిగమించాడు. తాజాగా జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్-2023 పురుషుల సింగిల్స్ టైటిల్ ను కైవసం చేసుకున్నాడు ఈ సెర్బియన్ యోధుడు. ఇది జకోవిచ్ కెరీర్ లో 10వ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ కావడం విశేషం. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో గ్రీక్ ఆటగాడు అయిన స్టెఫనోస్ సిట్సిపస్ పై 6-3, 7-6, (7/4), 7-6, (7/4)తేడాతో జకోవిచ్ విజయం సాధించాడు.
నోవాక్ జకోవిచ్.. టెన్నిస్ ప్రపంచంలో రారాజు. తనదైన స్టైల్ తో, తనదైన మార్క్ ఆటతో వరల్డ్ టెన్నిస్ లో చెరగని ముద్రవేశాడు. ఇప్పటికే పలు రికార్డులు సాధించి తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు జకోవిచ్. తాజాగా జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్-2023 పురుషుల సింగిల్స్ టైటిల్స్ ను కైవసం చేసుకున్నాడు ఈ సెర్బియన్ స్టార్. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో గ్రీక్ ఆటగాడు అయిన స్టెఫనోస్ సిట్సిపస్ పై 6-3, 7-6, (7/4), 7-6, (7/4)తేడాతో జకోవిచ్ విజయం సాధించాడు.
Novak + 🏆, a classic. pic.twitter.com/dEATUI3VgI
— US Open Tennis (@usopen) January 29, 2023
హోరాహోరిగా సాగిన ఈ మ్యాచ్ లో జకోవిచ్ ప్రత్యర్థిని చిత్తు చేశాడు. ఇక ఈ టైటిల్ గెలవడం ద్వారా అరుదైన ఘనత సాధించాడు జకోవిచ్. ఇది జకోవిచ్ కెరీర్లో 10వ ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ కావడం విశేషం. దానితో పాటుగా.. ఓవరాల్ గా జకోవిచ్ కెరీర్ లో ఇది 22వ గ్రాంగ్ స్లామ్ టైటిల్. తద్వారా అత్యధిక గ్రాండ్ స్లామ్స్ సాధించిన నాదల్(22) రికార్డును సమం చేశాడు జకోవిచ్. ఇక ఈ విజయంతో వరల్డ్ నంబర్ వన్ టెన్నిస్ స్టార్ గా అవతరించాడు. మరి జకోవిచ్ ఆస్ట్రేలియా ఓపెన్ గెలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
🏆 🏆 🏆 🏆 🏆 CHAMPION 🏆 🏆 🏆 🏆 🏆@DjokerNole has mastered Melbourne for a TENTH time!@wwos • @espn • @eurosport • @wowowtennis • #AusOpen • #AO2023 pic.twitter.com/ZThnTrIXdt
— #AusOpen (@AustralianOpen) January 29, 2023