ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్ 2022 మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి టీమిండియా ఓ పిరికి పంద అంటూ ఇంగ్లండ్ మాజీ ఆటగాడు నాసర్ హుస్సేన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా విజయావకాశాలపై స్పందిస్తూ.. వరల్డ్ కప్ టోర్నీల్లో టీమిండియా పిరికిగా ఆడుతుందని అన్నాడు. ఈ ఏడాది భారత్ ఆడిన సిరీస్‌లో మంచి ప్రదర్శన కనబర్చింది. ఈ ఏడాది ఇప్పటికే ఏకంగా 38 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఈ ఏడాదే కాదు గత నాలుగైదు ఏళ్లుగా భారత్ సిరీస్‌లలో అదరగొడుతోంది. కానీ.. ఐసీసీ మెగా ఈవెంట్స్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. 2014 తర్వాత టీమిండియా ఒక్క ఐసీసీ టోర్నీ ఫైనల్‌కు కూడా వెళ్లలేదు.
ఇదే విషయంపై నాసర్ మాట్లాడుతూ.. ఇండియా గత వరల్డ్ కప్స్‌లో మంచి అగ్రెసివ్ ఇంటెంట్‌తో ఆడేది. గతకొంత కాలంగా అదే మిస్ అవుతుంది. అందుకే 2011 తర్వాత మళ్లీ టీమిండియా ప్రపంచ కప్ గెలవలేదు. కానీ.. ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం అగ్రెసివ్ గేమ్‌తో ముందుకెళ్తున్నాడు. ఇది టీమిండియా కచ్చితంగా మంచిచేస్తుంది. వరల్డ్ కప్ టోర్నీల్లో పిరికి క్రికెట్ ఆడుతున్న టీమిండియా.. రోహిత్ కెప్టెన్సీలో దాన్ని వదిలేసినట్లు కపిపిస్తుంది. ఓపెనర్‌గా రోహిత్ శర్మ అగ్రెసివ్ బ్యాటింగ్‌కు తోడు.. సూర్యకుమార్ యాదవ్ విధ్వంసకర బ్యాటింగ్ టీమిండియా ప్లస్ పాయింట్ అని నాసర్ అన్నాడు.
కాగా.. ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 వరల్డ్ కప్ కోసం రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకుని.. వెస్టర్న్ ఆస్ట్రేలియాతో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతోంది. తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్.. రెండో మ్యాచ్‌లో ఓడింది. బ్యాటింగ్ పరంగా బలంగానే ఉన్నా.. బౌలింగ్ విభాగం టీమిండియాను కలవరపెడుతోంది. పైగా ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా వరల్డ్ కప్ దూరం కావడం జట్టు విజయావకాశాలపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఇక బ్యాటింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. కోహ్లీ కూడా టచ్‌లోనే ఉన్నాడు. కాగా.. కెప్టెన్ రోహిత్ శర్మ పవర్ ప్లేలో వేగంగా ఆడితేనే భారీ స్కోర్ వచ్చే అవకాశం ఉంది.
Nasser Hussain explains the reason behind India’s failure in ICC events.#NasserHussain #India https://t.co/BGJRs9nuhT
— CricTracker (@Cricketracker) October 13, 2022