ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 లీగ్ బిగ్‌బాష్‌లో సిడ్నీ థండర్ జట్టు కేవలం 15 పరుగులకే ఆలౌట్ సంచలనం నమోదు చేయగా.. అదే రోజు మన దేశవాళీ టోర్నీ.. రంజీ ట్రోఫీలోనూ ఒక సంచలన నమోదైంది. ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో అత్యంత చెత్త రికార్డును నమోద చేస్తూ.. నాగాలాండ్ జట్టు కేవలం 25 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ నెల 13న రంజీ సీజన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో నాగాలాండ్ తమ తొలి మ్యాచ్‌ను ఉత్తరాఖండ్‌తో ఆడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఉత్తరాఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 282 పరుగులకు ఆలౌట్ అయింది. ఉత్తరాఖండ్ బ్యాటర్లలో కునాల్ ఛండీలా 92, దీక్షాంశు నేగి 83 పరుగులతో రాణించారు. అలాగే నాగాలాండ్ సైతం తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసింది. ముంధే 161 సెంచరీతో పాటు ఓపెనర్ యుగేంధర్ సింగ్ 73 పరుగులతో రాణించడంతో నాగాలాండ్ 389 పరుగుల భారీ స్కోర్ సాధించి.. 100 పరుగులకు పైగా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందుకుంది.
ఇక రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఉత్తరాఖండ్ 7 వికెట్ల నష్టానికి 306 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి.. నాగాలాండ్‌కు 200 పరుగుల టార్గెట్ ఇచ్చింది. కానీ.. అనూహ్యంగా నాగాలాండ్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. వచ్చిన వారు వచ్చినట్టే.. వికెట్‌పారేసుకున్నారు. 11 మంది ఆటగాళ్లలో ఏకంగా ఏడుగురు బ్యాటర్లు ఖాతానే తెరవలేదు. 0, 7, 0, 0, 0, 1, 0, 7, 10, 0, 0.. ఇవి వరుసగా నాగాలాండ్ బ్యాటర్లు చేసిన స్కోర్లు. కేవలం 25 పరుగులు చేసి ఆలౌట్ అయిన నాగాలాండ్.. 174 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. రంజీ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును నమోదు చేసింది. ఉత్తరాఖండ్ బౌలర్లలో మయాంక్ మిశ్రా.. 9 ఓవర్లు వేసి 4 పరుగులు ఇచ్చి.. 5 వికెట్లు తీశాడు. అలాగే స్వప్నిల్ సింగ్ 9 ఓవర్లు వేసి.. 21 రన్స్ ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. మరి ఈ మ్యాచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Ranji Trophy: Nagaland are all out for 25 against Uttarakhand. This is not the lowest-ever total for a team as Hyderbad were all out for 21 against Rajasthan in 2010/11 season. #RanjiTrophy #CricketTwitter
— Venkata Krishna B (@venkatatweets) December 16, 2022