ఆసిస్ తో జరిగిన మూడో టెస్ట్ లో భారత బ్యాటర్లు విఫలం కావడంతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ క్రమంలోనే టీమిండియా బ్యాటర్లు ఓ విషయంలో తప్పుచేశారని చెప్పుకొచ్చాడు భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్.
రంజీ ట్రోఫీలో భాగంగా ఫైనల్లో సౌరాష్ట్ర-వెస్ట్ బెంగాల్ జట్లు తలపడుతున్నాయి. ఇక ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన బెంగల్ బ్యాట్స్ మెన్ లకు చుక్కలు చూపించారు సౌరాష్ట్ర బౌలర్లు. ముఖ్యంగా యంగ్ పేసర్ చేతన్ సకారియా తన ఇన్ స్వింగ్ లతో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించాడు.
జాతీయ జట్టుకు దూరమైన తర్వాత మయాంక్ అగర్వాల్ రంజీల్లో విజృంభిస్తున్నాడు. తాజాగా సౌరాష్ట్రతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్లో మయాంక్ అగర్వాల్ చెలరేగిపోయాడు. ఏకంగా డబుల్ సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.
క్రికెట్‌లో కొంతమంది కొట్టే షాట్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. సచిన్ స్ట్రేట్ డ్రైవ్, కోహ్లీ కవర్ డ్రైవ్, ధోని హెలికాప్టర్ షాట్, యువరాజ్ సింగ్ ఫ్లిక్ షాట్, రోహిత్ శర్మ పుల్‌షాట్, సూర్యకుమార్ యాదవ్ స్విప్ షాట్.. ఇలా మన ఇండియన్ ప్లేయర్లలో దాదాపు ఒక్కొక్కరికి ఓ ప్రత్యేకమై షాట్ ఉంది. ఆ షాట్‌ను వారు తప్ప ప్రపంచంలో మరే ఆటగాడు కూడా అంత సొగసుగా ఆడలేడు. వాళ్లు ఆ షాట్లు ఆడుతుంటే.. ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. అయితే.. […]
క్రికెట్‌లో సాధారణంగా.. తొలి ఐదు, ఆరు స్థానాల్లో బ్యాటింగ్ వచ్చే బ్యాటర్లే భారీ స్కోర్లు నమోదు చేస్తుంటారు. కానీ.. ప్రస్తుతం జరుగుతున్న ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ సీజన్ 2022-23లో సౌరాష్ట్ర బౌలింగ్ ఆల్‌రౌండర్ 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సెంచరీ బాదేశాడు. అది కూడా మరీ జిడ్డు బ్యాటింగ్‌తో కాదు.. అతని ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 4 సిక్సులు కూడా ఉన్నాయి. 147 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన పీకల్లోతు కష్టాల్లో పడిన తన జట్టును ఆదుకుంటూ.. […]
క్రికెట్‌లో ఒక చేతితో బ్యాటింగ్, మరో చేతితో బౌలింగ్ చేసే వాళ్లను చూసుంటాం. లెప్టాంటెడ్ బ్యాటర్ అయిన భారత మాజీ సారథి సౌరవ్ గంగూలీ.. కుడిచేతితో బౌలింగ్ చేస్తారనేది తెలిసిందే. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఇలాగే కుడి చేతితో బౌలింగ్, ఎడమ చేతితో బ్యాటింగ్ చేస్తాడు. ఇక బ్యాటింగ్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ లాంటి కొందరు బ్యాట్స్‌మన్ కుడి చేతితో బ్యాటింగ్ చేసినా.. అవసరమైనప్పుడు ఎడమ చేతితో రివర్స్ స్వీప్‌లు కొడుతుంటారు. దీని వల్ల బౌలర్‌కు బంతిని […]
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తిరిగి ట్రాక్ ఎక్కాడు. గాయం, సర్జరీ, ఎన్నికలతో కొన్ని నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న జడేజా.. మళ్లీ బాల్, బ్యాట్ పట్టి ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. బరిలోకి దిగడమే కాకుండా.. ఏకంగా 7 వికెట్ల హాల్‌తో దుమ్మురేపాడు. టీ20 వరల్డ్ కప్ 2022కు ముందు మోకాలి గాయం కారణంగా జట్టుకు దూరమైన జడేజా.. ఆ తర్వాత మోకాలికి శస్త్రచికిత్స చేయించకుని ఇంటికే పరిమితం అయ్యాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత.. […]
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మోకాలి గాయం కారణంగాం కొన్ని నెలలుగా భారత జట్టుకు దూరంగా ఉంటున్నాడు. గత ఆసియా కప్ సమయంలో జడేజా మోకాలికి గాయం కావడంతో అతడు జట్టుకు దూరం అయ్యాడు. సర్జరీ తర్వాత కోలుకున్న జడేజా తన భార్య ఎన్నికల ప్రచారంలో సైతం పాల్గొన్నాడు. ప్రస్తుతం పూర్తి ఫిట్ నెస్ సాధించాడు జడ్డూ భాయ్. రంజీల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. మంగళవారం తమిళనాడుతో జరగబోయే మ్యాచ్ లో సౌరాష్ట్ర కెప్టెన్ గా […]
ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న క్రికెటర్ పేరు సర్ఫరాజ్ ఖాన్. ఎందుకంటే రంజీల్లో సెంచరీల మీద సెంచరీలు చేస్తున్న సర్ఫరాజ్ ను జాతీయ జట్టులోకి తీసుకోలేదు. తనకు ఛాన్స్ రాలేదని కోపమో ఏమో, మ్యాచ్ మ్యాచ్ కి రచ్చ లేపుతూనే ఉన్నాడు. బ్యాటింగ్ లో ఒకటే బాదుడే. ఫామ్ లో ఉన్న సర్ఫరాజ్ ని పక్కనబెట్టి మిగతా వారిలో ఆస్ట్రేలియా సిరీస్ కు టీమ్ ని ఎంపిక చేయడంతో ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే సర్ఫరాజ్ […]
తమిళనాడు ఆటగాడు, త్రీడీ ప్లేయర్ విజయ్ శంకర్ రంజీల్లో దుమ్ము రేపుతున్నాడు. రంజీ ట్రోఫీ 2022-23లో హ్యాట్రిక్ సెంచరీలు నమోదు చేసి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. ఎలైట్ గ్రూప్-బిలో అస్సాంతో జరిగిన మ్యాచ్ లో విజయ్ శంకర్ హ్యాట్రిక్ సెంచరీ నమోదు చేశాడు. మొత్తం 187 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్ సాయంతో 112 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో తమిళనాడు జట్టు అస్సాంపై ఇన్నింగ్స్ 70 పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. […]