దేశంలో ఇప్పుడు అన్ని రంగాల్లో మహిళలు పురుషులతో సమానంగా తమ సత్తా చాటుతున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, క్రీడలు మాత్రమే కాదు ప్రతి వృత్తి, రాజకీయాల్లో మహిళలు తమదైన శైలిలో దూసుకు వెళ్తున్నారు.
దేశంలో ఎప్పుడు, ఎక్కడ ఎన్నికలు జరిగినా ముందుగా ప్రజల నాడిని తెలిపేవే.. ఎగ్జిట్ పోల్స్. ఇవి వాస్తవ ఫలితాలు కానప్పటికీ.. ప్రజల అభిప్రాయాలను సేకరించి వీటిని ప్రటకటిస్తారు కనుక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై అందరికీ ఆసక్తి ఎక్కువ. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో వివిధ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించాయి. ఆ వివరాలు..
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 లీగ్ బిగ్‌బాష్‌లో సిడ్నీ థండర్ జట్టు కేవలం 15 పరుగులకే ఆలౌట్ సంచలనం నమోదు చేయగా.. అదే రోజు మన దేశవాళీ టోర్నీ.. రంజీ ట్రోఫీలోనూ ఒక సంచలన నమోదైంది. ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో అత్యంత చెత్త రికార్డును నమోద చేస్తూ.. నాగాలాండ్ జట్టు కేవలం 25 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ నెల 13న రంజీ సీజన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో నాగాలాండ్ తమ తొలి మ్యాచ్‌ను […]
ఈ మధ్యకాలంలో మనిషిలో మానసిక స్థైర్యం అనేది కొరవడింది. చాలా మంది తమకు జీవితంలో ఎదురయ్యే సమస్యలను పెద్దవిగా చూసి భయపడిపోతుంటారు. ఆ సమస్యకు చావే పరిష్కారంగా భావించి..అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటారు. నమ్మించి మోసం చేయడంతో మరికొందరు తీవ్ర మనస్తాపం చెంది.. ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. అలానే ఓ ప్రైవేటు సంస్థను నమ్మి.. ఓ వ్యక్తి భారీ మొత్తంలో అప్పు చేశాడు. చివరకు వారు మోసం చేయడంతో .. అప్పు ఇచ్చిన వాళ్ల వేధింపులు ఎక్కువ కావడంతో బలవన్మరణానికి […]
మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఏదైనా సందర్భంలో డాన్స్ చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. కానీ, వాళ్లు నృత్యం చేస్తే ఆ వీడియోలు తప్పకుండా వైరల్ అవుతాయి. కొంతమంది పాజిటివ్ గా స్పందిస్తే ఇంకొంత మంది మాత్రం తప్పుబడుతుంటారు. కానీ, ఈ మంత్రి చేసిన డాన్స్ కు నెటిజన్లు అంతా ఆయన ఫ్యాన్స్ అయిపోయారు. ఆ వీడియో చూస్తూ తెగ మెచ్చేసుకుంటున్నారు. ఇప్పుడు చెప్పుకోబోయేది.. నాగాలాండ్ మంత్రి టెమ్‌జెన్ ఇమ్నా అలాంగ్ గురించి. ఈయన […]
ఈ మద్య కొంత మంది ఈజీ మనీ కోసం చేయరాని తప్పులు చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నారు. ఎదుటి వారు ఏమైనా పరవాలేదు.. తమకు డబ్బు వస్తే చాలు అన్న కోణంలో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇప్పటివరకు మానవ అక్రమ రవాణా గురించి విన్నాం. తాజాగా కుక్కల అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అస్సాంలో చోటుచేసుకుంది. జోర్ హట్ జిల్లాలో ముగ్గురు సభ్యుల ముఠా వీధి కుక్కలను ఎత్తుకెళ్లి.. అక్రమంగా నాగాలాండ్ కు తరలిస్తుండగా పోలీసులు […]
నాగాలాండ్‌లో దారుణం చోటు చేసుకుంది. భద్రతా దళాలు మిలిటెంట్లుగా భావించి జరిపిన కాల్పుల్లో 13 మంది పౌరులు మరణించగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. నిన్న సాయంత్రం మోన్ జిల్లా ఓటింగ్‌లో జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా దళాల కాల్పుల్లో మరణించిన వారందరూ బొగ్గు గని కార్మికులుగా గుర్తించారు. వారు విధులు ముగించుకుని వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయనే పక్కా సమాచారంతో భారత జవాన్లు […]