టెస్టు స్పెషలిస్ట్ మురళీ విజయ్ టీమిండియాలో స్థానం కోల్పోయిన విషయం తెలిసిందే. కానీ, తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో మాత్రం విజయ్ పరుగుల వరద పారిస్తున్నాడు. కానీ, ఇటీవల మురళీ విజయ్ కి తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో ఓ ఛేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. గ్యాలరీలోని కొందరు డీకే అభిమానులు డీకే డీకే అంటూ నినాదాలు చేశారు. దినేష్ కార్తీక్‌కి మురళీ విజయ్‌కి మధ్య అంత గొప్ప సత్సంబంధాలు లేవని అందరికీ తెలుసు.
ఆ విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడం కూడా చూశాం. దినేష్ కార్తీక్ ఫ్యాన్స్ డీకే డీకే అని అరుస్తుండగా మురళీ విజయ్ అలా అరవకండని దండం పెట్టి మరీ వేడుకున్నాడు. కానీ, డీకే ఫ్యాన్స్ మాత్రం ఆపకుండా అలాగే నినాదాలు చేశారు. ఆ తర్వాత మురళీ విజయ్ ఆగ్రహం వ్యక్తం చేయడం అంతా సోషల్ మీడియాలో చూశారు. ఆ వీడియోలు కూడా ఎంతో వైరల్ గా మారాయి.
Fans chanting DK DK in front of Murali Vijay.
Success Is the Best Revenge 😎 pic.twitter.com/UYyGoMKrnV— Virat is Universal GOAT 🐐 (@CricCrazyKohli) July 21, 2022
ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన మరో కొత్త వీడియో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆ సందర్భంలో తర్వాత కోపంతో మురళీ విజయ్ గ్యాలరీలోని ఫ్యాన్స్ పై దూసుకెళ్లాడు. అలా ఎందుకు అరుస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇటువైపు ఫ్యాన్స్ కూడా ఏమాత్రం తగ్గకుండా మీదకు దూసుకెళ్లారు. అయితే మధ్యలో సిబ్బంది మురళీ విజయ్ ని వారించి మైదానంలోకి పంపేశారు. డీకే ఫ్యాన్స్ తో మురళీ విజయ్ ఫైట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.