ఫామ్ కోల్పోయి నానా తంటాలు పడుతున్న టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లిపై విమర్శలు, సానూభూతి సందేశాలతో పాటు పొగడ్తలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియా సారధి రోహిత్ శర్మ, పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్.. విరాట్‌కు మద్దతుగా నిలబడితే.. ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ ఏకంగా ఆకాశానికి ఎత్తాడు. కోహ్లీని జట్టు నుంచి తప్పించాలంటూ సీనియర్ల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. ‘అతన్ని తప్పించే మగాడు. ఇంకా పుట్టలేదు మామ’ అంటూ ఛలోక్తి విసిరాడు. కాదని తప్పిస్తే.. కోట్లలో నష్టపోతారంటూ హెచ్చరించాడు.
విరాట్ కోహ్లీ 71వ సెంచరీ చేస్తాడా..? చెయ్యడా..? అసలు ఇప్పట్లో కోహ్లీ ఫామ్ లోకి వస్తాడా..? రాడా..? నిద్ర లేచినప్పటి నుంచి ఇవే ప్రశ్నలు. 2019 నవంబర్‌లో అంతర్జాతీయ కెరీర్‌లో 71వ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ, ఆ తర్వాత రెండున్నరేళ్లుగా సెంచరీ మార్కు అందుకోలేకపోయారు. ఐపీఎల్, ద్వైపాక్షిక సిరీసులు, అంతర్జాతీయ టోర్నీలు.. ఇలా అన్నింట విఫలమవుతూ జట్టుకి భారంగా మారాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టులో ఆకట్టుకోలేకపోయిన విరాట్ కోహ్లీ.. వన్డేల్లో సైతం నిరాశపరుస్తున్నాడు. ఈ క్రమంలో కోహ్లీని జట్టు నుంచి తప్పించాలంటూ సీనియర్లు ఒక్కక్కరుగా గళం వినిపిస్తున్నారు. ఈ క్రమంలో కోహ్లీ గురించి ఇంగ్లీష్ మీడియాతో ముచ్చటించిన ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Venkatesh Prasad has his say on dropping great players when they are out of form 👀🇮🇳#venkateshprasad #ViratKohli #ENGvIND #IndianCricketTeam #CricketTwitter pic.twitter.com/blX7iiglPj
— Sportskeeda (@Sportskeeda) July 11, 2022
‘ కోహ్లీని జట్టులోంచి తీసేయడం అంత తేలికయ్యే పని కాదు. ఎందుకంటే అతను ఓ ప్లేయర్ మాత్రమే కాదు, ఓ బ్రాండ్.. వరల్డ్‌లోనే మోస్ట్ మార్కెటబుల్ క్రికెటర్. సచిన్ తర్వాత కోహ్లీకి మాత్రమే జనాల్లో అంతటి పాపులారిటీ ఉంది. కోహ్లీ బొమ్మ టీవీ మీద కనిపిస్తే చాలు కాసుల పంట కురుస్తోంది. అందువల్ల బీసీసీఐ ఆ సాహసం చేయకపోవచ్చు. కాదని తప్పిస్తే కోట్లలో నష్టాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. కోహ్లీ మైదానంలో నడుచుకునే తీరు ప్రతీ ఒక్కరినీ నచ్చుతుంది. అతను ప్రతీ మూమెంట్‌ని పూర్తిగా ఎంజాయ్ చేస్తాడు.
“Virat Kohli is the most marketable cricketer in the World. Everybody just wants to watch Virat Kohli bat or see him on the field. Fans love him a lot. When Virat plays, Stadiums are full of sponsors.” – Monty Panesar (To TOI) pic.twitter.com/cFrdczGMND
— ShaYan Vfc (@ShaYanVK18) July 15, 2022
‘ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్.. ఇలా అన్ని దేశాల్లోనూ అతనికి అభిమానులు ఉన్నారు.ఒక్క బీసీసీఐ మాత్రమే కాదు అన్ని దేశాల క్రికెట్ బోర్డులు కూడా కోహ్లీ పేరు చెప్పే సంపాదించుకున్నాయి. అతన్ని చూపించి స్పాన్సర్లను రాబట్టుకున్నాయి. టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ కు ఎంతో సమయం లేదు. ఈ టైమ్‌లో ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలనే ఏ బోర్డు అయినా ఆలోచించడం సహజం. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ఆర్థికంగా క్రికెట్‌కు ఎంతో అవసరం. ఇప్పుడు బీసీసీఐ చేయాల్సిందల్లా అతన్ని ఫామ్‌లోకి ఎలా తేవాలి? అని మాత్రమే. కాదని తప్పిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఏదేమైనా.. విరాట్‌ను పక్కనెబట్టాలనే ఆలోచన బీసీసీఐ చేస్తుందని మాత్రం నేను అనుకోను.’ అని మాంటీ పనేసర్ చెప్పుకొచ్చాడు.
Monty Panesar on why BCCI can’t afford to ‘drop’ Virat Kohli.#CricTracker #MontyPanesar #ViratKohli #ENGvIND pic.twitter.com/aYxqFiWH6D
— CricTracker (@Cricketracker) July 15, 2022
ఇక.. విరాట్ కోహ్లీ పాపులారిటీ గురించి అందరకి తెలిసిందే. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లు కలిగియున్న తొలి క్రికెటర్ కోహ్లీ. సంపాదనలోనూ కోహ్లీనే నెంబర్ వన్ క్రికెటరే. కేవలం ప్రకటనల ద్వారానే అతను కోట్లలో సంపాదిస్తున్నాడు. సోషల్ మీడియా వేదికగా ఓ ప్రమోషన్ ట్వీట్లకు కోట్లలో ఆర్జిస్తున్నాడు. కోహ్లీ ఫామ్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
𝗙𝗼𝗿𝗺𝘀 𝗰𝗮𝗻 𝗯𝗲 𝘂𝗽 𝗮𝗻𝗱 𝗱𝗼𝘄𝗻 𝗯𝘂𝘁 𝗤𝘂𝗮𝗹𝗶𝘁𝘆 𝗶𝘀 𝗽𝗲𝗿𝗺𝗮𝗻𝗲𝗻𝘁 ✅💖🔥
Rohit Sharma’s 𝗿𝗲𝗮𝗰𝘁𝗶𝗼𝗻 𝗼𝗻 Virat Kohli 𝗶𝗻 𝗽𝗿𝗲𝘀𝘀 𝗰𝗼𝗻𝗳𝗲𝗿𝗲𝗻𝗰𝗲 𝗬𝗲𝘀𝘁𝗲𝗿𝗱𝗮𝘆 🙌❤️✨
#KingKohli #ViratKohli #ViratKohli𓃵 #RohitSharma #Virat #INDvsENG pic.twitter.com/wmUVlCpOSp— Reja Hossain (@RejaHossain999) July 11, 2022
ఇది కూడా చదవండి: Virat Kohli vs Rohit Sharma: కోహ్లీని కించపరిచేలా మాట్లాడిన పాక్ క్రికెటర్!
ఇది కూడా చదవండి: Virat Kohli: విమర్శలపై స్పందించిన విరాట్ కోహ్లీ..! కాస్త గట్టిగానే ఇచ్చేశాడు!