ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా ఓటమి కంటే ‘కింగ్’ కోహ్లి ఫామ్‌పైనే క్రీడా వర్గాల్లో ఎక్కువగా చర్చ జరుగుతోందంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు పరుగుల యంత్రంగా పేరుగాంచిన విరాట్ కోహ్లి.. ప్రస్తుతం విషమ దశను ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా కెప్టెన్సీ చేజారిన తర్వాత కోహ్లి పరిస్థితి దిగజారిందనే చెప్పవచ్చు. దీంతో కోహ్లీ ప్రదర్శనపై విదేశీ ఆటగాళ్లు, మాజీ క్రికెటర్స్.. ఒకరివెంట ఒకరు స్పందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పాక్ క్రికెటర్, ఇంజమామ్ ఉల్ హక్ మేనల్లుడు ఇమామ్ ఉల్ హక్ ఈ జాబితాలోకి చేరిపోయాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ భారత క్రికెట్‌కి ప్రధాన ప్లేయర్లే. ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్లే. కానీ, రోహిత్ శర్మకు దేవుడిచ్చిన ఓ స్పెషల్ టాలెంట్ ఇచ్చాడు. విరాట్ కోహ్లీలో అది లేదు అంటూ కోహ్లీని కించపరిచేలా మాట్లాడాడు. "రోహిత్ శర్మ బ్యాటింగ్‌లో టైమింగ్ ఉంటుంది. చుట్టూ ఫీల్డర్లు ఉన్నా టైమింగ్ వాడి చూడచక్కని షార్ట్స్ కొట్టడంలో రోహిత్ శర్మ దిట్ట. అంతేకాదు.. విరాట్‌తో పోలిస్తే రోహిత్ శర్మ ఆటలో దూకుడు ఉంటుంది. మొదటి బంతి నుంచే అటాకింగ్ గేమ్ ఆడడానికి ఇష్టపడతాడు. అది కోహ్లీ ఆటలో కనిపించదు. విరాట్ కోహ్లీ ఆట కంటే రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌లను రిప్లే వేసుకుని చూడడానికే ఎక్కువగా ఇష్టపడతా. రోహిత్ క్రీజులో సెట్ అయ్యాడంటే.. అతన్ని అవుట్ చేయడం చాలా కష్టం. అందుకే నేను రోహిత్ శర్మలా ఆడాలని కోరుకుంటున్నాను.." అని చెప్పుకొచ్చాడు. Imam-ul-Haq expresses his opinion on Rohit Sharma and Virat Kohli.#CricTracker #RohitSharma #ViratKohli #ENGvsIND #Cricket pic.twitter.com/WJ6Gti8q0H — CricTracker (@Cricketracker) July 14, 2022 వన్డేల్లో 261మ్యాచులాడిన కోహ్లీ 12327 పరుగులు చేయగా.. రోహిత్ శర్మ 232 మ్యాచులాడి 9359 పరుగులు చేశాడు. ఇక.. కోహ్లీ అత్యధిక స్కోర్ 183 ఉండగా.. రోహిత్ హైయెస్ట్ స్కోర్ .. 264గా ఉంది. ఇమామ్ ఉల్ హక్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. Rohit Sharma's pull shot Vs Virat Kohli's cover drive ! pic.twitter.com/mlChwWzIlq — Govardhan Reddy (@gova3555) July 15, 2022 ఇది కూడా చదవండి: Virat Kohli: విరాట్ కోహ్లీ మద్దతుగా విదేశీ క్రికెటర్స్! కోహ్లీ విలువ మనోళ్ళకి అర్థం కాదా? ఇది కూడా చదవండి: Lalit Modi-Sushmita Sen: మూడోసారి ప్రేమలో పడ్డ సుష్మితా సేన్.. ఈసారి ఐపీఎల్ చైర్మన్ తో..!