ఐపీఎల్.. ఆటగాళ్లను ఉన్నపళంగా ఆకాశానికి ఎత్తేస్తుంది.. అవసరం తీరిందంటే అత్యంత దారుణంగా అవమానిస్తుంది. ఏళ్లకు ఏళ్లు జట్టుకు సేవలందించిన ఆటగాళ్లను తేలికగా వదిలేసుకుంటుంది. దీంతో చాలా మంది మంచి ఆటగాళ్ల కూడా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇదే కోవకు చెందిన ఒక క్రికెటర్ ఒకప్పుడు ప్రత్యర్ధి బ్యాటర్లకు తన బౌలింగ్‌తో చుక్కలు చూపించాడు. ఐపీఎల్-2014లో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు. అతడే టీమిండియా పేసర్ మెహిత్ శర్మ.
ఒకప్పుడు స్టార్ బౌలర్‌గా చక్రం తిప్పిన మోహిత్ శర్మ ఇప్పుడు నెట్ బౌలర్‌గా ఎంపికయ్యడంటే ఊహించడానికే కష్టంగా ఉంది. ఐపీఎల్‌లో కొత్త జట్టుగా అవతరించిన గుజరాత్ టైటాన్స్‌కు నెట్ బౌలర్‌గా మెహిత్ శర్మ ఎంపికైనట్లు తెలుస్తోంది. అతడితో పాటు మరో భారత పేసర్ బరీందర్ స్రాన్ కూడా గుజరాత్ నెట్ బౌలర్‌గా ఎంపికైనట్లు సమాచారం. ఇక ఐపీఎల్-2022 మెగా వేలంలో పాల్గొన్న మెహిత్ శర్మను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపలేదు.
మోహిత్ శర్మ చివరసారిగా ఐపీఎల్-2021 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్‌కు ఆడాడు. ఇక 2014 సీజన్‌లో 23 వికెట్లు సాధించి పర్పుల్ క్యాప్‌ను కూడా గెలుచుకున్నాడు. ఇప్పటి వరకు 86 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన మోహిత్.. 92 వికెట్లు పడగొట్టాడు. ఇక 2014 టీ20 ప్రపంచకప్, 2015 వన్డే ప్రపంచకప్‌లో భారత్ తరుపున మోహిత్ శర్మ ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం మోహిత్ నెట్ బౌలర్‌గా ఎంపిక కావడంపై క్రికెట్ నిపుణులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి మోహిత్ పరిస్థితిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఇషాన్ కిషన్‌ను అందుకే వద్దనుకున్నాం: SRH బౌలింగ్ కోచ్
Mohit Sharma, representing Chennai Super Kings, had emerged the highest wicket-taker in the 2014 IPL season, taking 23 wickets at an average of 19.65 in 16 matches. pic.twitter.com/sPbFnAhc8y
— Raja News (@RajabetsNews) March 20, 2022
IPL 2022: Mohit Sharma turns out as net bowler for Gujarat Titans, shocks fans https://t.co/TDNhW4VMEC
— TOI Sports News (@TOISportsNews) March 20, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.