క్రికెట్ చరిత్రలో ఎన్నో మెరుపు సెంచరీలు నమోదైనప్పటికీ ఈ అద్భుత సెంచరీ గురించి కూడా కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ప్రత్యర్ధి టీం నిర్ధేశించిన 227 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీం మొదటి ఓవర్ లోనే 2 కీలక వికెట్లు కోల్పోయినప్పటికీ టార్గెట్ ని చేధించిన సంఘటన. సూపర్ స్మాష్ లీగ్‌లో భాగంగా శనివారం న్యూప్లైమౌత్ వేదికగా సెంట్రల్ స్టాగ్స్‌తో వెల్లింగ్టన్ ఫైర్‌బర్డ్స్ తలపడింది. ఈ మ్యాచ్‌లో వెల్లింగ్టన్ ఫైర్‌బర్డ్స్ కెప్టెన్ మైఖేల్ బ్రేస్‌వెల్ సంచలనం సృష్టించాడు. కేవలం 65 బంతుల్లో 11ఫోర్లు,11 సిక్స్‌లతో 141 పరుగులు సాధించి టీంను విజయ తీరాలకు చేర్చాడు. బ్రేస్‌వెల్ సునామీ ఇన్నింగ్స్ ఫలితంగా సెంట్రల్ స్టాగ్స్‌పై వెల్లింగ్టన్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Michael Bracewell that is UNREAL!pic.twitter.com/Im5jbB2F4A
— CRICKET VIDEOS 🏏 (@AbdullahNeaz) January 8, 2022
కాగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సెంట్రల్ స్టాగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 227 పరగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. 227 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెల్లింగ్టన్ 24 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. ఇక ఓటమి తప్పదు అనుకున్న సమయంలో కెప్టెన్ బ్రేస్‌వెల్ సిక్సర్లు, ఫోర్లతో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో వెల్లింగ్టన్ ఫైర్‌బర్డ్స్ సంచలన విజయం సాదించింది. అంతే కాకుండా ఈ మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 455 పరుగులు రావడం విశేషం. కాగా సూపర్ స్మాష్ లీగ్ చరిత్రలోనే వ్యక్తిగతంగా అత్యధిక స్కోర్ బ్రేస్‌వెల్‌దే కావడం విశేషం. బ్రేస్‌వెల్టీ 20 కేరిర్‌లో ఇదే తొలి సెంచరీ. ఈ ఇన్నింగ్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
The sound off the bat! 😍
Michael Bracewell looking to tee off after a horror start for the Firebirds. Firebirds 38/4 (4.2) Watch play LIVE on @sparknzsport or free-to-air on @TVNZ 1 LIVE scoring https://t.co/v49vrPn7pO #WEAREWELLINGTON #SuperSmashNZ pic.twitter.com/RXCJkmL49h
— Cricket Wellington (@cricketwgtninc) January 8, 2022