RCB, Michael Bracewell: ఐపీఎల్ 2023 ఆరంభానికి ముందు వేలంలో కోట్లు పెట్టి కొన్న విల్ జాక్స్ గాయంతో దూరం అయ్యాడు. దీంతో ఆర్సీబీ అతని స్థానంలో మరో ప్లేయర్‌ను రీప్లేస్‌మెంట్‌గా తీసుకుంది. ఆ ప్లేయర్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో సెంచరీతో సత్తా చాటి.. జట్టులో స్థానం పక్కా చేసుకున్నాడు.
అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ నేటితో మొదలుకానుంది. ఒకవైపు మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ తొలి మ్యాచ్ కోసం సిద్ధమవుతుంటే.. మరోవైపు మిగతా జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అన్ని జట్లు ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడుతున్న సంగతి తెలిసిందే. అన్ని జట్లలాగా ఆర్సీబీ కూడా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడగా.. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ బ్యాట్టింగ్ ఆల్ రౌండర్ మైకేల్ బ్రేస్ వెల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ ఇన్నింగ్స్ ని చూసిన సగటు ఆర్సీబీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
ఈ ఏడాది జరిగిన వేలంలో 3.20 కోట్ల భారీ ధరకు విల్ జాక్స్ ని కొనుగోలు చేసింది ఆర్సీబీ. ఇంగ్లండ్‌కి చెందిన ఈ ఆల్ రౌండర్ బ్యాటింగ్ లో పవర్ హిట్టింగ్ తో పాటు.. స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు. దీంతో ఆల్ రౌండర్లు అంతగా లేని ఆర్సీబీ టీంకి విల్ జాక్స్ రాక కలిసొస్తుందని భావించారంతా. మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం అవుతుందనగా విల్ జాక్స్ అనూహ్యంగా గాయపడడం ఆర్సీబీని ఇబ్బందుల్లోకి నెట్టింది. అయితే.. అతనికి రీప్లేస్‌మెంట్‌గా ఆర్సీబీ యాజమాన్యం మైకేల్ బ్రేస్‌వెల్‌ను తీసుకుంది. బ్రేస్ వెల్ కూడా జాక్స్ లాగ లోయర్ ఆర్డర్ లో హిట్టింగ్ చేస్తూ స్పిన్ వేయగలడు. కానీ ఈ న్యూజిలాండ్ కుర్రాడి మీద మాత్రం పెద్దగా ఎవరికీ అంచనాలు కూడా లేవు. అసలు తుది జట్టులో ఉంటాడా? అనే సందేహం కూడా ఉంది. కానీ ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆడిన తుఫాన్ ఇన్నింగ్స్ చూస్తుంటే బ్రేస్ వెల్ కూడా ఆర్సీబీ జట్టులో కీలకంగా మారతాడేమో అనిపిస్తుంది. కేవలం 55 బంతుల్లో 105 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు 7 సిక్సర్లు ఉండడం విశేషం.
విల్ జాక్స్ స్థానంలో బ్రేస్ వెల్ ని తీసుకొని వచ్చి ఆర్సీబీ మేనేజ్మెంట్ సఫలమైందనే చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే జాక్స్ తో పోలిస్తే ఈ న్యూజిలాండ్ ఆల్ రౌండర్ కి అంతర్జాతీయ స్థాయిలో అనుభవం ఎక్కువగా కూడా ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో భారత్ పై హైదరాబాద్ లో జరిగిన తొలి వన్డేలో.. బ్రెస్ వెల్ భారీ సెంచరీతో చెలరేగి దాదాపు మ్యాచ్ గెలిపించినంత పని చేసాడు. ఇప్పుడు ప్రాక్టీస్ మ్యాచ్ లో కూడా సెంచరీ చేయడం జట్టులో ఆనందాన్ని నింపుతుంది. ఏప్రిల్ 2 న ముంబై మ్యాచ్ తో ఆర్సీబీ తన తొలి మ్యాచ్ ఆడబోతుంది. మరి ఇదే ఊపుని బ్రేస్ వెల్ కొనసాగించి ఎంత కీలకంగా మారతాడో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
Royal Challenge Packaged Drinking Water Moment of the Day 📸
A rapid-fire hundred in the practice game and Michael Bracewell looks set to go! 💯🤌#PlayBold #ನಮ್ಮRCB #IPL2023 #Choosebold #RoyalChallenge pic.twitter.com/zrx7s2pR8i
— Royal Challengers Bangalore (@RCBTweets) March 31, 2023