ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటములతో ఆ జట్టు అభిమానులు డీలాపడ్డారు. తమ టీమ్ ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతేనని ఫిక్సయ్యారు. కానీ రాజస్థాన్ రాయల్స్‌పై ఆర్సీబీ భారీ విక్టరీ కొట్టడంతో వాళ్లు సంతోషంలో మునిగిపోయారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లేఆఫ్స్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అవ్వాలంటే తప్పక గెలవాల్సిన తరుణంలో ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు సమష్టి కృషితో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ జట్టులోని బ్యాట్స్‌మెన్‌తో పాటు బౌలర్లు, ఫీల్డర్లు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 171 రన్స్ చేసింది. సారథి ఫాఫ్ డుప్లెసిస్ (55), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (54) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఇన్నింగ్స్ చివర్లో అనూజ్ రావత్ (29) మంచి ఫినిషింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆర్సీబీ బౌలర్ల ధాటికి ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ 59 రన్స్‌కే కుప్పకూలింది. ఆ టీమ్‌లో షిమ్రన్ హెట్మెయిర్ (35) ఒక్కడే రాణించాడు. మిగతా బ్యాట్స్‌మెన్ అందరూ అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. బెంగళూరు బౌలర్లలో వేన్ పార్నెల్, మహ్మద్ సిరాజ్‌తో పాటు బ్రేస్‌వెల్, కర్ణ్‌శర్మ కూడా బాగా రాణించారు.
రాజస్థాన్‌ను ఇంత తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో ఇద్దరు ఆర్సీబీ బౌలర్లు కీలకపాత్ర పోషించారు. అందులో ఒకరు పార్నెల్ అయితే, మరొకరు బ్రేస్‌వెల్. గత రెండు మ్యాచ్‌ల్లో ఫెయిల్ అయిన స్పీడ్‌స్టర్ జోష్ హేజెల్‌వుడ్, స్పిన్నర్ వనిందు హసరంగ స్థానంలో చోటు దక్కించుకున్నారు పార్నెల్, బ్రేస్‌వెల్. తమకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాజస్థాన్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కూల్చడంలో కీలక పాత్ర పోషించారు. పార్నెల్ 3 ఓవర్లలో 10 రన్స్ మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. బ్రేస్‌వెల్ 3 ఓవర్లు వేసి 16 రన్స్ ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. వరుస ఓటములతో డీలాపడ్డ ఆర్సీబీకి.. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో వీళ్లిద్దర్నీ తీసుకోవడం కలిసొచ్చింది. జాస్ బట్లర్, సంజూ శాంసన్, పడిక్కల్ లాంటి డేంజరస్ బ్యాట్స్‌మెన్‌ను వీళ్లు త్వరగా పెవిలియన్‌కు పంపారు. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో గొప్పగా రాణించిన పార్నెల్, బ్రేస్‌వెల్ తర్వాతి మ్యాచుల్లో కూడా తమ ప్రతిభకు తగ్గట్లుగా ఆడితే ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
RCB’s move of replacing Josh Hazlewood and Wanindu Hasaranga with Wayne Parnell and Michael Bracewell turned out to be game-deciding.
📸: IPL/BCCI pic.twitter.com/1Qejj5bCVT
— CricTracker (@Cricketracker) May 14, 2023