సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2023 సీజన్ లో ఇరగదీస్తోంది. మొదటి రెండు మ్యాచుల్లో పరాజయం చవిచూసిన ఎస్ఆర్ హెచ్ ఇప్పుడు విజయాల బాట పట్టింది. మూడో మ్యాచ్ విజయం తర్వాత కోల్ కతాపై హైదరాబాద్ బ్యాటర్లు విరుచుకుపడ్డారు. ముఖ్యంగా హ్యారీ బ్రూక్ శతకంతో చెలరేగాడు.
ఐపీఎల్ 2023 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జోరు పెంచేసింది. మొదటి రెండు మ్యాచుల్లో పరాజయం పాలైన ఎస్ఆర్ హెచ్ టీమ్ మూడో మ్యాచ్ నుంచి విన్నింగ్ ట్రాక్ లోకి వచ్చింది. ఇప్పుడు కోలకతాతో జరుగుతున్న నాలుగో మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో అద్భుతమైన స్కోర్ చేసింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్ కతా హైదరాబాద్ బ్యాటర్లను కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమైంది. కేకేఆర్ బౌలర్లు అంతా మూకుమ్మడిగా చేతులెత్తేశారు. హైదరాబాద్ బ్యాటర్లు ఒక్కొక్కరిని బౌండరీలతో భయపెట్టారు. నరైన్ లాంటి సీనియర్ బౌలర్ కూడా వికెట్ దక్కించుకోలేక పోయాడంటేనే అర్థం చేసుకోవాలి హైదరాబాద్ ఎలా రఫ్పాడించిందో.
ముఖ్యంగా ఈ మ్యాచ్ లో హ్యారీ బ్రూక్ గురించి చెప్పుకోవాలి. మొదటి 3 మ్యాచ్ లలో విఫలమైన బ్రూక్ ఘోరమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. అతడు ఓ టెస్ట్ ప్లేయర్ అయితే కావ్యా మారన్ రూ.13.5 కోట్లు ఇచ్చి అనవసరంగా కొన్నారు అంటూ కామెంట్స్ చేశారు. రూ.13 కోట్లు పెడితే 13 పరుగులు చేశాడంటూ హేళన చేశారు. ఇప్పుడు ట్రోలర్స్ మొత్తానికి బ్రూక్ తన బ్యాటుతోనే సమాధానం చెప్పాడు. ఏడుగురు బౌలర్లు వచ్చినా కూడా బ్రూక్ ని కట్టడి చేయలేకపోయారు. ఉమేష్, నరైన్, చక్రవర్తి వంటి వాళ్లు కూడా బ్రూక్ ధాటికి చేతులెత్తేశారు. కేవలం 55 బంతుల్లోనే 181.82 స్ట్రైక్ రేట్ తో 12 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో హ్యారీ బ్రూక్ తన కెరీర్ లో తొలి ఐపీఎల్ సెంచరీ నమోదు చేశాడు.
🔥💥🔥💥🔥💥
First innings in emojis 😎 pic.twitter.com/GilEupu4Fl
— SunRisers Hyderabad (@SunRisers) April 14, 2023
ఇప్పటి వరకు తిట్టిన, ట్రోల్ చేసిన వాళ్లే ఇప్పుడు నెట్టింట హ్యారీ బ్రూక్ బ్రహ్మ రథం పడుతున్నారు. మరోవైపు కెప్టెన్ మార్కరమ్ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 26 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ కూడా 17 బంతుల్లోనే 32 పరుగులు నమోదు చేశాడు. నెట్టింట హ్యారీ బ్రూక్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తెలుగు అభిమానులు బేగంపేట బ్రూక్ ఫామ్ లోకి వచ్చాడు అంటూ కామెంట్ చేస్తున్నారు. హ్యారీ బ్రూక్ మెరుపు శతకం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Much obliged, sir! 🤌 pic.twitter.com/jr04KeeBbD
— SunRisers Hyderabad (@SunRisers) April 14, 2023