ఆ కుర్రాడు పుట్టింది ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో. కానీ నెదర్లాండ్స్ క్రికెట్ జట్టుకు ఆడుతున్నాడు. ఏదో ఉన్నానంటే ఉన్నానన్నట్లు కాకుండా తాజాగా జరిగిన ఓ మ్యాచ్ లో సెంచరీతో రికార్డ్ సృష్టించాడు. తెలుగోడి సత్తా ఏంటో ప్రూవ్ చేశాడు.
మన దేశంలో పుట్టిన పిల్లల నుంచి పెద్దోళ్ల వరకు అందరూ దాదాపుగా ఇష్టపడే గేమ్ క్రికెట్. ఎంత బాగా ఆడినా సరే కొన్నిసార్లు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవకాశాలు రాకపోవచ్చు. దీంతో వేరే జాబ్ చేసుకోవడమో లేదంటే వేరే దేశానికి వెళ్లిపోయి అక్కడ ఆడటమో చేస్తుంటారు. ఉన్ముక్త్ చంద్ లాంటి క్రికెటర్ ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించి, అమెరికాలో లీగ్స్ ఆడుకుంటున్నాడు. ఇలా లిస్ట్ తీస్తే చాలామందే ఉంటారు. అలానే నెదర్లాండ్స్ వెళ్లిపోయి ఆ దేశానికి ఆడుతున్న ఏపీ కుర్రాడు.. అద్భుతమైన రికార్డ్ సాధించాడు. చివరి ఓవర్ వరకు థ్రిల్లింగ్ గా సాగిన ఈ మ్యాచ్ లో తన జట్టును గెలిపించాడు. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో, క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. నెదర్లాండ్స్ క్రికెట్ జట్టుకు ఆడుతున్న తేజ నిడమనూరు పుట్టింది విజయవాడలో, చదువుకున్నది పెరిగింది మాత్రం హైదరాబాద్ లో. బిజినెస్ డెవలప్ మెంట్ మేనేజర్ గా విదేశాల్లో పనిచేస్తున్న టైంలోనే క్రికెట్ పై ఆసక్తి పెరిగింది. దీంతో 2017-18లో ఆక్లాండ్ లో సూపర్ స్మాష్ లీగ్ లో ఆటగాడిగా అరంగేట్రం చేశాడు. 2019లో నెదర్లాండ్స్ కు వెళ్లిపోయిన తేజ.. ప్లేయర్ కమ్ కోచ్ గా మారిపోయాడు. 2021లో ఓ మ్యాచ్ లో సెంచరీ చేయడంతో మనోడి పేరు కాస్త వైరల్ అయింది. అలా గతేడాది మేలో నెదర్లాండ్స్ వన్డే జట్టులో చోటు సంపాదించాడు. జులైలో టీ20 జట్టులో సభ్యుడిగా మారిపోయాడు. తాజాగా జరిగిన మ్యాచ్ లో జింబాబ్వేపై విజయానికి కారణమయ్యాడు.
తాజాగా జరిగిన మ్యాచ్ నే తీసుకుంటే హరారేలో జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే, 47.3 ఓవర్లలో 249 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన నెదర్లాండ్స్.. 110 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిపోయింది. సరిగా ఈ టైంలో క్రీజులోకి వచ్చిన తేజ నిడమనూరు(96 బంతుల్లో 110 నాటౌట్) కళ్లు చెదిరిపోయే బ్యాటింగ్ చేశాడు. పాల్ వాన్ మెక్ రిన్ (21), షారిజ్ అహ్మద్ (30).. తేజకు సహకరించారు. చివరి వరకు ఎంతో థ్రిల్లింగ్ గా జరిగిన ఈ మ్యాచులో నెదర్లాండ్స్ గెలిచేసరికి తేజ పేరు మార్మోగిపోతోంది. ఎందుకంటే ఏడో స్థానంలో వచ్చి సెంచరీ చేసిన ఐదో బ్యాటర్ గా ఘనత సాధించాడు. వన్డేల్లో ఛేజింగ్ లో ఏడో వికెట్ కు అత్యధిక భాగస్వామం నెలకొల్పిన ఐదో జోడీగా తేజ-షారిజ్ అఫ్రిది నిలిచారు. ఈ జోడీ 110 పరుగులు జోడించింది. ఇలా ఆంధ్రా కుర్రాడు ఏకంగా నెదర్లాండ్స్ జట్టుని గెలిపించడంతో మనవాళ్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.
What an innings from Teja Nidamanuru. At one Nederlands was 64/5 & 110/6 and they chasing 250 runs, then Teja scored unbeatan 110* runs from 94 balls including 9 fours and 3 sixes against Zimbabwe. Incredible innings! pic.twitter.com/GgsFq7audq
— CricketMAN2 (@ImTanujSingh) March 21, 2023